Home > జాతీయం > Youtuber Vasan: యూట్యూబర్పై హైకోర్ట్ సీరియస్.. ఛానెల్ మూసేయాలని వార్నింగ్

Youtuber Vasan: యూట్యూబర్పై హైకోర్ట్ సీరియస్.. ఛానెల్ మూసేయాలని వార్నింగ్

Youtuber Vasan: యూట్యూబర్పై హైకోర్ట్ సీరియస్.. ఛానెల్ మూసేయాలని వార్నింగ్
X

యూట్యూబ్.. యువతకు ఉపాధి అయింది. అందులో వీడియోలు చేస్తూ డబ్బు సంపాధిస్తున్న వాళ్లు చాలామందే ఉన్నారు. అయితే కొంతమంది ఇతరులకు ఉపయోగపడే వీడియోలు చేస్తుంటే.. ఇంకొందరు వాళ్ల ట్యాలెంట్ చూపిస్తూ వీడియోలు చేస్తుంటారు. అందులో భాగంగానే తమిళనాడుకు చెందిన బైకర్ వాసన్.. యూట్యూబ్ లో ‘యూట్యూబ్ లో టీటీఎఫ్ వాసన్’ పేరుతో యూట్యూబ్ చానల్ నడుపుతున్నాడు. తన యూట్యూబ్ చానెల్ లో బైక్ స్టంట్స్ చేస్తూ లక్షల మంది ఫాలోవర్లను సంపాదించుకున్నాడు. అతను చేసే రోడ్ ట్రిప్పులు, బైక్ స్టంట్స్ చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇటీవల చెన్నై- వేలూరు హైవే రోడ్లపై బైక్ స్టంట్ చేస్తూ అదుపుతప్పి ప్రమాదానికి గురయ్యాడు.





ప్రమాదం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అతనికి హెల్మెట్, రేస్ సూట్ ఉండేసరికి పెద్ద ప్రమాదం తప్పి, చేతికి చిన్న ఫ్యాక్చర్ తో బయటపడ్డాడు. దీంతో వాసన్ పై కేసు నమోదు చేసిన పోలీసులు.. అతన్ని అరెస్ట్ చేసి కస్టడీకి తీసుకున్నారు. కాగా సెప్టెంబర్ 26న జరిగిన విచారణలో కాంచిపురం కోర్ట్ ఆయన బెయిల్ పిటిషన్ ను కొట్టేసింది. ఈ క్రమంలో వాసన్ మద్రాస్ హైకోర్ట్ ను ఆశ్రయించాడు. గురువారం జరిగిన విచారణలో ప్రభుత్వం తరుపు న్యాయవాది వాదిస్తూ.. ‘వాసన్ కు యూట్యూబ్ లో 45 లక్షల మంది సబ్ స్క్రైబర్లు ఉన్నారు. రూ. 20 లక్షల బైక్, రూ.3 లక్షల రేస్ సూట్ తో బైక్ స్టంట్ వీడియోలు చేస్తుంటాడు. యువతను కూడా తనలా చేయాలిన ప్రేరేపిస్తుంటాడు. ఇది చాలా ప్రమాదకరం’అని కోర్టుకు వివరించాడు. ఈ వాదనతో ఏకీభవించిన కోర్టు.. బెయిల్ పిటిషన్ ను కొట్టేసింది. అతనికి గుణపాఠం చెప్తూ.. తక్షణమే తన యూట్యూబ్ చానెల్ ను మూసేయాలని ఆదేశించింది. ఆ తర్వాత తిరిగి కోర్టును ఆశ్రయించాలని సూచించింది.









Updated : 5 Oct 2023 4:05 PM IST
Tags:    
Next Story
Share it
Top