Home > జాతీయం > రాహుల్ గాంధీకి షర్మిల విషెస్.. కాంగ్రెస్లో వైఎస్సార్టీపీ విలీనం..!

రాహుల్ గాంధీకి షర్మిల విషెస్.. కాంగ్రెస్లో వైఎస్సార్టీపీ విలీనం..!

రాహుల్ గాంధీకి షర్మిల విషెస్.. కాంగ్రెస్లో వైఎస్సార్టీపీ విలీనం..!
X

ఇవాళ రాహుల్ గాంధీ బర్త్ డే.. దీంతో పలువురు ప్రముఖులు ఆయనకు విషెస్ చెబుతున్నారు. అయితే వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల రాహుల్కు విషెస్ చెప్పడం ఆసక్తికరంగా మారింది.

గత కొద్దిరోజులుగా కాంగ్రెస్లో తన పార్టీని షర్మిల విలీనం చేస్తారనే ప్రచారం జరుగుతోంది. బెంగళూరులో డీకే శివకుమార్తో భేటీ తర్వాత ఈ చర్చ మరింత ఎక్కువైంది. ఈ క్రమంలో ఆమె రాహుల్కు విషెస్ చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది.

‘‘రాహుల్ గాంధీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు మీ పట్టుదల, సహనంతో ప్రజలకు స్ఫూర్తినిస్తూ..నిజాయితితో వారికి సేవ చేస్తూ ఉండండి. మీరు మంచి ఆరోగ్యం, ఆనందంతో ఉన్నత విజయాలను అందుకోవాలని కోరుకుంటున్నాను’’ అని షర్మిల ట్వీట్ చేశారు. వైఎస్సార్ మరణం తర్వాత ఆయన కుటుంబానికి, కాంగ్రెస్ పార్టీకి సత్సబంధాలు లేవు. జగన్ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి వైసీపీ పెట్టారు. అయితే ఇప్పుడు రాహుల్ గాంధీకి షర్మిల విషెస్ చెప్పడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.

షర్మిల ట్వీట్‌తో కాంగ్రెస్‌లో వైఎస్సార్‌టీపీ విలీనం ఖాయమైందని.. అందుకు ఈ ట్వీట్ నిదర్శమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికే షర్మిలతో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఫోన్‌లో చర్చలు జరిపినట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి షర్మిల కూడా అంగీకరించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. కాగా పొత్తుకు సంబంధించి ఇతర పార్టీల నుంచి ఫోన్లు వస్తున్న విషయాన్ని షర్మిల కూడా ధృవీకరించారు. చాలా పార్టీల నుంచి తనకు ఫోన్లు వస్తున్నాయని, కానీ లిఫ్ట్ చేయడం లేదని గతంలో ఆమె చెప్పారు.







Updated : 19 Jun 2023 3:41 PM IST
Tags:    
Next Story
Share it
Top