Home > జాతీయం > ఆ పార్టీ నుంచి ఎన్నికల్లో పోటీ చేయనున్న యువరాజ్ సింగ్

ఆ పార్టీ నుంచి ఎన్నికల్లో పోటీ చేయనున్న యువరాజ్ సింగ్

ఆ పార్టీ నుంచి ఎన్నికల్లో పోటీ చేయనున్న యువరాజ్ సింగ్
X

దేశంలో మరికొన్ని రోజుల్లో ఎన్నికల నగారా మోగనుంది. రాజకీయ పార్టీలన్నీ ఇప్పటికే తమ ప్రణాళికలను సిద్ధం చేసుకునే పనిలో పడ్డాయి. ఏ అభ్యర్థిని ఏ స్థానం నుంచి బరిలోకి దింపాలో వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఓ వార్త.. ఇటు టీమిండియా క్రికెట్ వర్గాలు, అటు రాజకీయ వర్గాల్లో ఓ న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. టీమిండియా మాజీ క్రికెటర్, 2011 వరల్డ్ కప్ విన్నింగ్ హీరో యువరాజ్ సింగ్ రానున్న లోక్ సభ ఎన్నికల బరిలో దిగబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. పంజాబ్ లోని గురుదాస్ పూర్ నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నాడట. అయితే ఈ వార్త వైరల్ కావడానికి కారణం లేకపోలేదు.

యువీ ఇటీవల తన తల్లి షబ్నమ్ తో కలిసి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిశాడు. దీనికి సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే దీనిపై యువరాజ్ కూడా నోరు మెదపకపోవడంతో.. ఇదే నిజమని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. కాగా ప్రస్తుతం గురుదాస్ పూర్ ఎంపీగా బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ ఉన్నాడు. అతను 2019 ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుపొందాడు. అయితే మరికొంతమంది ఈ వార్తల్లో నిజం లేదని కొట్టిపారేస్తున్నారు. ఓ మంత్రిని మర్యాద పూర్వకంగా కలవడం కూడా తప్పా? అంటూ కామెంట్ చేస్తున్నారు.


Updated : 22 Feb 2024 10:02 PM IST
Tags:    
Next Story
Share it
Top