Home > జాతీయం > ఈ డెలివరీ బాయ్ కెవ్వు కేక.. కస్టమర్లకు చాక్లెట్లతో ఇచ్చిపడేశాడు

ఈ డెలివరీ బాయ్ కెవ్వు కేక.. కస్టమర్లకు చాక్లెట్లతో ఇచ్చిపడేశాడు

ఈ డెలివరీ బాయ్ కెవ్వు కేక.. కస్టమర్లకు చాక్లెట్లతో ఇచ్చిపడేశాడు
X

ఫైడ్ డెలివరీ బాయ్స్ ఏం చేసినా సంచలనమే. వాళ్ల ప్రతి చర్య ఒక న్యూసే. వాళ్లపై ఎప్పుడూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటుంది. అలానే ఓ డెలివరీ బాయ్ వైరల్ అవుతున్నాడు. ఆనందం పంచుకుంటే పెరుగుతుందని, చేసే పనిలో చిన్నా పెద్దా చూడని ఆ డెలివరీ బాయ్.. తనదైన రోజును ఎంజాయ్ చేయాలనుకున్నాడు. పరోక్షంగా తనకు సాయపడుతున్న వాళ్లకు సర్ ప్రైజ్ ఇవ్వాలనుకున్నాడు. అంతే, తనకు ఆర్డర్ వచ్చిన ప్రతీ ఒక్కరికి ఒక చాక్లెట్ ఇస్తూ పోయాడు. దాంతో సర్ ప్రైజ్ అయిన కస్టమర్స్.. దాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. అసలేం జరిగిందంటే..





ఢిల్లీకి చెందిన కరణ్ ఆప్టే.. జొమాటోలో డెలివరీ బాయ్ గా పనిచేస్తున్నాడు. తనకు బతుకుదెరువునిచ్చే ఈ జాబ్ ను ఎంతగానో ప్రేమిస్తుంటాడు. అందుకే, శుక్రవారం తన పుట్టిన రోజైనా.. హాలిడే తీసుకోకుండా, పనికి వచ్చాడు. అంతేకాదు కస్టమర్లు ఫ్యామిలీగా భావించిన కరణ్.. డెలివరీ చేసిన ప్రతీ ఐటమ్ తో పాటు ఓ ఫైవ్ స్టార్ చాక్లెట్ ను ఇచ్చాడు. దాంతో ఆశ్చర్యపోవడం కస్టమర్లవంతయింది. అక్కడితో ఆగని కొంతమంది కస్టమర్లు.. సోషల్ మీడియాలో జొమాటోను ట్యాగ్ చేసి.. అతని పుట్టిన రోజును సెలబ్రేట్ చేయాలని కోరారు. ‘మన బర్త్ డే రోజు గిఫ్ట్ లు ఎవరిస్తారని వెయిట్ చేస్తాం. కానీ, ఈ కరణ్ పరిచయం లేని మా కోసం చాక్లెట్స్ ఇస్తున్నాడ’ని కామెంట్స్ చేస్తున్నారు.




Updated : 30 Jun 2023 6:26 PM IST
Tags:    
Next Story
Share it
Top