Home > జాతీయం > Zombie Virus : ప్రపంచానికి మరో వైరస్ ముప్పు.. ఒక్కసారి సోకిందంటే..

Zombie Virus : ప్రపంచానికి మరో వైరస్ ముప్పు.. ఒక్కసారి సోకిందంటే..

Zombie Virus : ప్రపంచానికి మరో వైరస్ ముప్పు.. ఒక్కసారి సోకిందంటే..
X

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలన్నింటినీ వణికించింది. ఆ వైరస్ పేరెత్తితేనే జనం హడలిపోయే పరిస్థితి తెచ్చింది. అయితే దానికి కొన్ని వందల రెట్లు పవర్ ఉన్న వైరస్ సోకితే.. అసలు ఆ విషయం ఊహించడానికి వెన్నులో వణుకు పడుతుంది. కానీ వాతావరణ పరిస్థితులు ఇలాగే కొనసాగితే త్వరలోనే అలాంటి పరిస్థితి తలెత్తుతుందని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు.

48వేలకుపైగా ఏండ్లుగా ఆర్కిటిక్ మంచు కింద కప్పబడిన జాంబీ వైరస్ సోకితే.. మనిషి కాళ్లు, చేతులు వంకర్లుపోయి పిచ్చిపట్టినట్లు ప్రవర్తిస్తారు. ఆలోచన, విచక్షణా జ్ఞానం కోల్పోయి మృగంలా మారిపోతారు. వినడానికి జాంబీ సినిమా కథలా ఉన్నా.. ఈ రీల్ లైఫ్ స్టోరీ రియల్ లైఫ్ లో వచ్చే ప్రమాదం లేకపోలేదని సైంటిస్టులు అంటున్నారు.

నిజానికి ఈ వైరస్ ఆర్కిటిక్ మంచు కింద 48,500 ఏండ్ల క్రితమే కప్పబడిపోయింది. కానీ గ్లోబల్ వార్మింగ్ కారణంగా ఆ ప్రాంతంలో మంచు వేగంగా కరిగిపోతోంది. ఫలితంగా ఆ వైరస్ బయటకు వస్తోందని ఎయిక్స్ మార్సిల్లే యూనివర్సిటీ సైంటిస్టులు చెబుతున్నారు. ఈ జాంబీ వైరస్ బయటకు వస్తే.. పోలియో తరహాలో జనం అనారోగ్యం బారిన పడతారని.. మానవాళికి పెనుముప్పు తప్పదని హచ్చరిస్తున్నారు.ఈ జాంబీ వైరస్ వేల ఏండ్ల క్రితమే మంచులో కప్పబడిపోయినా ఇప్పటికీ సజీవంగానే ఉందట. ఇప్పుడు ఆర్కిటిక్ మంచు కరగుతుండటంతో ఆ నీళ్ల ద్వారా వైరస్ జనంలోకి వచ్చేస్తుందని చెబుతున్నారు.

జాంబీ వైరస్ గాలి ద్వారా వ్యాపించే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయంట

రష్యాలోని సైబీరియన్‌ ప్రాంతంలో కరుగుతున్న మంచు నమూనాలను పరిశీలించిన సైంటిస్టులు.. 13 కొత్త తరహా వైరస్‌లను 2022లో గుర్తించారు. వాటిలో ఒకటి జాంబీ వైరస్. సైబీరియా ప్రాంతంలో ట్రాఫిక్ పెరగడం, క్రూడాయిల్ వెలికితీయడం, పరిశ్రమల సంఖ్య పెరుగుతుండటంతో ఆర్కిటిక్ ప్రాంతంలో మంచు వేగంగా కరుగుతోంది. క్రూడాయిల్ కోసం వేల అడుగుల లోతులో డ్రిల్లింగ్ చేస్తుండటం వల్ల కూడా జాంబీ వైరస్ బయటకు వచ్చే ప్రమాదం ఉందని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. జాంబీ వైరస్‌ కారణంగా జరిగే నష్టం ఎంత మేర ఉంటుందన్నది విషయం స్పష్టంగా తెలియకపోయినా మానవాళి మనుగడకే ప్రమాదం ఉంటుందన్నది శాస్త్రవేత్తలు చెబుతున్న మాట.




Updated : 23 Jan 2024 7:17 PM IST
Tags:    
Next Story
Share it
Top