Home > జాతీయం > మిజోరంలో కొలువుదీరిన కొత్త సర్కారు

మిజోరంలో కొలువుదీరిన కొత్త సర్కారు

మిజోరంలో కొలువుదీరిన కొత్త సర్కారు
X

ఈశాన్య రాష్ట్రం మిజోరంలో కొత్త సర్కారు కొలువుదీరింది. ఇటీవలే జరిగిన ఎన్నికల్లో జోరామ్ నేషనలిస్ట్ పార్టీ ఘన విజయం సాధించింది. దీంతో జెడ్ఎన్పీ అధినేత లాల్దుహోమో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. మిజోరం గవర్నర్ కంభంపాటి హరిబాబు ఆయనతో ప్రణామం చేయించారు.

నవంబర్‌ 7న మిజోరం అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. 40 స్థానాలకు జరిగిన ఎన్నికలో జోరామ్‌ నేషనలిస్ట్‌ పార్టీ 27 చోట్ల ఘన విజయం సాధించింది. మిజో నేషనల్‌ ఫ్రంట్‌ కేవలం 10 స్థానాలే గెలుచుకుని ప్రతిపక్ష పాత్రకు పరిమితమైంది.

74 ఏండ్ల వ‌య‌సున్న లాల్దు హోమా.. ఐపీఎస్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. గోవా, ఢిల్లీలో ఐపీఎస్‌గా ప‌ని చేశారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ సెక్యూరిటీ ఇంఛార్జ్గా ఉన్న ఆయన.. రాజ‌కీయాలపై ఆసక్తితో ఐపీఎస్ ప‌ద‌వికి రాజీనామా చేశారు. రాజకీయాల్లోకి వచ్చి 1984లో లోక్‌స‌భ‌కు ఎన్నిక‌ల్లో పోటీ చేసి విజయం సాధించారు. తాజాగా మిజోరం సీఎంగా బాధ్యతలు చేపట్టారు.

Updated : 8 Dec 2023 10:05 AM GMT
Tags:    
Next Story
Share it
Top