అదంతా బీఆర్ఎస్ చేస్తున్న ప్రచారం.. బండి సంజయ్
అదంతా బీఆర్ఎస్ చేస్తున్న ప్రచారం.. బండి సంజయ్
X
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని మారుస్తారన్న ప్రచారం ఒట్టి అబద్ధమని అన్నారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. తెలంగాణలో బీజేపీని విచ్ఛినం చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. ఇలాంటి లీకులు, అసత్య ప్రచారాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో తమకు తెలుసన్నారు. లీకులు ఇచ్చే వారిపై అధిష్టానానికి పిర్యాదు చేస్తామన్నారు. లీకులకు కేరాఫ్ అడ్రస్ కేసీఆరే అని.. ఆయన పార్టీలో ఏం జరుగుతుందో చూడకుండా పక్క పార్టీలో కుట్రలు చేయడమే ఆయనకు అలవాటుగా మారిందన్నారు. పార్టీ అధ్యక్షుడి మార్పు అంటూ.. బీఆర్ఎస్ చేస్తున్న ప్రచారమేనని అన్నారు.
ఈటల రాజేందర్‌పై హత్యకు కుట్ర చేసిన వారిని ప్రభుత్వం గుర్తించి వెంటనే అరెస్టు చేసి శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈటల భద్రత ఇష్యూ పై మంత్రి కేటీఆర్ స్పందించాడని.. సీఎం కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. తనతో పాటు మరో ఇద్దరు బీజేపీ నేతలపై దాడి జరిగిందని అన్నారు. తమ పార్టీ నేతలపై దాడులు చేసి, కుట్రపన్నిన వ్యక్తులను విడిచిపెట్టి తమపై కేసులు పెట్టి, జైళ్లలుకు పంపించారని మండిపడ్డారు.
భోపాల్ పట్టణంలో జరిగిన "మేరా భూత్ సబ్సే మజ్బూత్" కార్యక్రమానికి హాజరై నిన్న హైదరాబాద్ చేరుకున్నారు బండి సంజయ్. ఈ సందర్భంగా.. బీజేపీని బూతు స్థాయి నుంచి పటిష్ఠం చేయడానికి "మేరా బూత్ సబ్ సే మజ్బూత్" కార్యక్రమం ప్రారంభించాము. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం అందచేసే పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి బీజేపీ పట్ల ప్రజల్లో నమ్మకం ఏర్పరరిచేందుకు ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుంది అని పేర్కొన్నారు.
Krishna
సట్టి కృష్ణ.. Mic Tv websiteలో సబ్ ఎడిటర్గా పని చేస్తున్నారు. ఈయనకు జర్నలిజంలో 8 ఏళ్ల అనుభవం ఉంది. గతంలో V6 News, CVR news,Mojo Tv, 6TV వంటి పలు ఛానళ్లలో పనిచేశారు. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, స్పోర్ట్స్, సినిమా, అనాలిసిస్లు రాయగలరు.