Home > రాజకీయం > టీడీపీలోకి కమెడియన్ సప్తగిరి..చిత్తూరు జిల్లాలో పోటీ..!

టీడీపీలోకి కమెడియన్ సప్తగిరి..చిత్తూరు జిల్లాలో పోటీ..!

టీడీపీలోకి కమెడియన్ సప్తగిరి..చిత్తూరు జిల్లాలో పోటీ..!
X

ఇప్పటికే చాలామంది సినీతారలు రాజకీయాల్లోకి అడుగుపెట్టి తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. తాజాగా మరో టాలీవుడ్ నటుడు రాజకీయాల్లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యాడు. తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు కమెడియన్ సప్తగిరి ప్రకటించారు. టీడీపీ నుంచి ఆఫర్ ఉందని.. 10, 15 రోజుల్లో గుడ్ న్యూస్ చెబుతానని చెప్పారు. దీంతో ఆయన టీడీపీలో చేరడం ఖాయమనిపిస్తోంది. తిరుపతిలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తన పొలిటికల్ ఎంట్రీపై కీలక వ్యాఖ్యలు చేశారు.

చిత్తూరు జిల్లాలోని లోక్సభ లేదా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు సప్తగిరి తెలిపారు. తనకు టీడీపీ అంటే ఇష్టమని.. గతంలో చంద్రబాబు చేసిన డెవలప్మెంట్ చూస్తూ పెరిగానని వివరించారు. టీడీపీ అధికారంలో రావడానికి అవసరమైతే రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేయడానికి కూడా సిద్ధమని స్పష్టం చేశారు. ఇటీవలే లోకేష్ను కలిసి ఆశీర్వాదం తీసుకున్నట్లు తెలిపిన ఆయన.. పార్టీ ఆదేశాల ప్రకారం నడుచుకుంటానని చెప్పారు.

‘‘పేదల కష్టాలు నాకు తెలుసు. పేదలకు సేవ చేయడానికి ఏ చిన్న అవకాశం వచ్చినా నా వంతు కృషి చేస్తా. నిజాయతీతో సినిమా రంగంలో అవకాశాలను దక్కించుకోగలిగాను. అలాగే రాజకీయాల్లో కూడా మంచి పేరు తెచ్చుకుంటా. సినిమా వల్లే రాజకీయంగా అవకాశాలు వచ్చాయి. సినిమాలను వదిలేసే ప్రసక్తే లేదు’’ అని సప్తగిరి తెలిపారు. కాగా చిత్తూరు జిల్లాలోని ఐరాల ప్రభుత్వాసుపత్రిలో తాను పుట్టినట్లు సప్తగిరి చెప్పారు. బంగారుపాళ్యం, పుంగనూరులో చదివానన్నారు.


Updated : 12 Jun 2023 4:26 PM IST
Tags:    
Next Story
Share it
Top