నన్ను అసెంబ్లీలో అడుగుపెట్టకుండా ఆపే దమ్ముందా.. లోకేష్‌కు అనిల్ సవాల్
నన్ను అసెంబ్లీలో అడుగుపెట్టకుండా ఆపే దమ్ముందా.. లోకేష్‌కు అనిల్ సవాల్
X
వైసీపీ నేత, ఏపీ మాజీ మంత్రి అనిల్ కుమార్.. తనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ చేసిన విమర్శలపై స్పందించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తనను ఓడిస్తే రాజకీయాల నుండి తప్పుకుంటానని లోకేష్ కు సవాల్ విసిరారు. నెల్లూరు జిల్లాలో సాగుతున్న యువగళం పాదయాత్రలో నారా లోకేష్.. అనిల్ కుమార్ పై విమర్శలు చేశారు. శుక్రవారం నెల్లూరులో మీడియాతో మాట్లాడిన అనిల్ కుమార్ ఈ విమర్శలపై స్పందిస్తూ.. . తనను వచ్చే ఎన్నికల్లో ఓడించే దమ్ము లోకేష్ కు ఉందా అని ప్రశ్నించారు. తనపై నెల్లూరులో పోటీ చేసి గెలవాలని లోకేష్ కు సవాల్ విసిరారు. తన సవాల్ ను లోకేష్ ఎందుకు స్వీకరించడం లేదని ఆయన ప్రశ్నించారు. తన సవాల్ పై నేరుగా స్పందించకుండా డొంకతిరుగుడుగా మాట్లాడుతున్నారనిచెప్పారు. గెలిచినోడు చెబితే ఓడినోడు వినాలని, తాను రెండు సార్లు గెలిస్తే.. లోకేష్ రెండు సార్లు ఓడిపోయాడని ఎద్దేవా చేశారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తనను అసెంబ్లీలోకి అడుగు పెట్టకుండా చేసేందుకు తనపై ఎవరైనా పోటీ చేయాలని మాజీ మంత్రి అనిల్ కుమార్ చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తాను ఓటమి పాలైతే రాజకీయాల నుండి తప్పుకుంటానని తేల్చి చెప్పారు. తన సవాల్ పై లోకేష్ స్పందించాలని మాజీ మంత్రి అనిల్ కుమార్ చెప్పారు. నాలుగు రోజుల క్రితం మాజీ మంత్రి అనిల్ కుమార్ నుద్దేశించి లోకేష్ విమర్శలు చేశారు. ఈ వ్యాఖ్యలపై అనిల్ కుమార్ స్పందించిన విషయం తెలిసిందే. తన సవాల్ కు లోకేష్ స్పందించాలని ఇవాళ మరోసారి మాజీ మంత్రి అనిల్ కుమార్ కోరారు.