Home > రాజకీయం > మంత్రి కేటీఆర్‌‌పై కొండా మురళీ ఘాటు వ్యాఖ్యలు

మంత్రి కేటీఆర్‌‌పై కొండా మురళీ ఘాటు వ్యాఖ్యలు

మంత్రి కేటీఆర్‌‌పై కొండా మురళీ ఘాటు వ్యాఖ్యలు

మంత్రి కేటీఆర్‌‌పై కొండా మురళీ ఘాటు వ్యాఖ్యలు
X

వ‌రంగ‌ల్ తూర్పులో గుండాలు, రౌడీల‌కు చోటు ఇవ్వ‌ొద్దంటూ మంత్రి కేటీఆర్ ప‌రోక్షంగా కాంగ్రెస్ నేత‌, మాజీ ఎమ్మెల్సీ కొండా ముర‌ళీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై.. ఆయన స్పందించారు. మంత్రి చేసిన వ్యాఖ్య‌ల‌కు కౌంటర్ ఇస్తూ.. నా పేరు ప‌ల‌క‌డానికే భ‌య‌ప‌డ్డ పేడు మూతి బోడి లింగానివి మా గురించి మాట్లాడేటోడివా..? నువ్వు అంటూ ఎద్దేవా చేశారు. శ్రీకృష్ణదేవరాయల వంశీయులం కాబట్టి మీసాలు పెంచుతామని, కేటీఆర్ అటు-ఇటు కాదు కాబట్టి.. ఆయనకు మీసాలు రావని అందుకే తన మీసాల మీద కామెంట్ చేశారని ఎద్దేవా చేశారు. వ‌రంగ‌ల్ ర‌త్న హోట‌ల్‌లో ఆదివారం మ‌ధ్యాహ్నం నిర్వ‌హించిన విలేక‌రుల స‌మావేశంలో మంత్రి కేటీఆర్‌ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. వ‌రంగ‌ల్ బ‌హిరంగ స‌భ‌లో రౌడీలు, గుండాల‌కు వ‌రంగ‌ల్‌లో తావులేదంటూ ప‌రోక్షంగా మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్య‌ల‌కు ... గుండా, రౌడీ అని తెలిసి కూడా త‌న‌ను ఎందుకు పార్టీలోకి తీసుకున్నావ్‌.. ఎందుకు ఎమ్మెల్సీ ప‌ద‌వి ఇచ్చావో ప్ర‌జ‌ల‌కు చెప్పాలన్నారు.

తాను పేద ప్ర‌జ‌ల కోసం కొట్లాడితే గుండా, రౌడీలుగా పోల్చుతున్నార‌ని, పేదలకు సేవచేస్తే రౌడీ అనుకుంటే తనకు అభ్యంతరం లేదన్నారు. వరంగ‌ల్ తూర్పు నియోజ‌క‌వ‌ర్గంలో బ‌స్వ‌రాజు సార‌య్య‌ను ఓడ‌గొట్టేందుకు పార్టీలోకి రావాల‌ని నువ్వు నన్ను పిలిచిన్నా, నీ ద‌గ్గ‌ర‌కు నేను వ‌చ్చిన్నో చెప్పాల‌న్నారు. తనకు ఆత్మాభిమానం ఎక్కువ కాబట్టి తరాజు జోకేటోడు (ఎర్రబెల్లి దయాకర్ రావు) పార్టీలోకి వస్తే మేము బయటికి వచ్చామన్నారు. కొండా దంపతులు బీదల కోసం బడుగు బలహీన వర్గాల కోసం పనిచేస్తార‌న్నారు. చావుకైనా వెనుకాడరని స్ప‌ష్టం చేశారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కొండా సురేఖ గెలుపు ఖాయమని, అందుకే బీఆర్ఎస్ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయన్నారు. వరంగ‌ల్ తూర్పు కొండా అడ్డా అంటూ కౌంటర్ ఇచ్చారు.

తాను నియోజకవర్గంలో తిరిగితే కేటీఆర్‌కు ఉచ్చపడుతుందన్నారు. ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ నమ్మకద్రోహిని ఆరోపించారు. సిరిసిల్ల పద్మశాలీలంతా కొండా సురేఖకు హుజురాబాద్ ఉప ఎన్నికల్లో పోటీచేయమన్నారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కొండా సురేఖ గెలిచితీరుతుందని మురళి స్పష్టం చేశారు. చదువురాని దయాకరరావును మంత్రిని చేసి మేధావి అయిన కడియం శ్రీహరిని పక్కకు పెట్టారని దుయ్యబట్టారు. ఛత్తీస్గఢ్, కర్ణాటకలో లాగానే తెలంగాణలో కూడా ఐదు నెలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందంటూ జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఎవరైతే అక్రమాలు చేసిల్లో వారిని అణా పైసతో కక్కించి బీదలకు పంచిపెట్టుంటే పెట్టే బాధ్యత త‌న‌దంటూ వ్యాఖ్య‌నించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, డివిజన్ల అధ్యక్షులు, కొండ అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.




Updated : 19 Jun 2023 8:28 AM IST
Tags:    
Next Story
Share it
Top