Home > రాజకీయం > పవన్ కళ్యాణ్‌కు పోటీగా వాలంటీర్‌ను నిలబెట్టి గెలిపిస్తాం.. ఏపీ మంత్రి

పవన్ కళ్యాణ్‌కు పోటీగా వాలంటీర్‌ను నిలబెట్టి గెలిపిస్తాం.. ఏపీ మంత్రి

'వీడు తినేది, పడుకొనేది, తందనాలాడేది పక్క రాష్ట్రంలో'

పవన్ కళ్యాణ్‌కు పోటీగా వాలంటీర్‌ను నిలబెట్టి గెలిపిస్తాం.. ఏపీ మంత్రి
X

వాలంటీర్లను ఉద్దేశిస్తూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు, వాలంటీర్లు ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మంత్రి జోగి రమేశ్.. పవన్ కళ్యాణ్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. వాడు అని సంబోధిస్తూ.. పవన్ కళ్యాణి అక్క అని అన్నారు. పవన్ పోటీ చేసే స్థానంలో వాలంటీర్ ను నిలబెట్టి గెలపిస్తామని ఛాలెంజ్ చేశారు. పవన్ కు దమ్ము, ధైర్యం ఉంటే సింగిల్ పోటీ చేసి గెలవాలన్నారు. జగన్మోహన్ రెడ్డి అనేది ఒక ఎవరెస్ట్ శిఖరమని, ఆ శిఖరాన్ని తాకే దమ్ము, ధైర్యం జనసేనకు లేదన్నారు. పొత్తు పెట్టుకోకుండా గెలిచే సత్తా ఆ పార్టీకి లేదన్నారు.

పవన్ కళ్యాణ్ కు ఏపీలో తిరిగే అర్హత లేదన్నారు. ఆయన ఉండేది తినేది, తందనాలు ఆడేది పక్కరాష్ట్రంలో.. ఆంధ్రతో సంబంధం లేదని అన్నారు. వాలంటీర్ వ్యవస్థ దేశానికే ఆదర్శమని, వాళ్లను ఒక్కమాట అంటే పరిస్థితి ఎలా ఉంటుందో పవన్ కళ్యాణ్ కు అర్ధమైందని, చెప్పులతో కొట్టినా సిగ్గు రాలేదన్నారు. ఏపీలోని 5 కోట్ల మంది ప్రజలు సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థలపై సంతోషం, ఆనందం వ్యక్తం చేస్తుంటే.. పవన్ మాత్రం వాలంటీర్లను కించపరిచారని మండిపడ్డారు.

Updated : 14 July 2023 1:43 PM IST
Tags:    
author-thhumb

Veerendra Prasad

వీరేందర్ మైక్ టీవీ వెబ్‌సైట్ లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌(సబ్ ఎడిటర్)గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ అంశాలకు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 6 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో(V6, T News) రాజకీయం, లైఫ్ స్టైల్, జాతీయ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.


Next Story
Share it
Top