Home > రాజకీయం > కాంగ్రెస్లో కలవాలని హరీశ్ రావు ప్లాన్ .. జైల్లో వేస్తానని కేసీఆర్ వార్నింగ్ : పేర్ని నాని

కాంగ్రెస్లో కలవాలని హరీశ్ రావు ప్లాన్ .. జైల్లో వేస్తానని కేసీఆర్ వార్నింగ్ : పేర్ని నాని

కాంగ్రెస్లో కలవాలని హరీశ్ రావు ప్లాన్ .. జైల్లో వేస్తానని కేసీఆర్ వార్నింగ్ : పేర్ని నాని
X

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి పేర్నినాని తెలంగాణ మంత్రి మంత్రి హరీష్ రావుకు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఏపీ నేతలు మాటల్లో తప్ప.. చేతల్లో లేరని విమర్శించిన హరీశ్ రావు కామెంట్లను తిప్పికొట్టారు పేర్ని నాని. హరీశ్.. చంద్రబాబును ఫాలో అయి.. కేసీఆర్, కేటీఆర్ లకు ద్రోహం చేస్తున్నాడని.. వాళ్లపై ఆయనకు పీకల దాకా కోపం ఉందన్నారు నాని. ఆ కోపాన్ని వాళ్లపై తీర్చుకోలేని హరీశ్.. ఏపీపై విమర్శలు చేస్తున్నారన్నారు నాని.

హరీశ్ రావు బాధ పడలేకనే కేసీఆర్ పక్కన పెట్టుకున్నాడని.. అది నిజం కాదంటే 2018లో కేసీఆర్ కేబినెట్ లో హరీశ్ ఎందుకు లేరని ప్రశ్నించాడు. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఎక్కువ సీట్లు రాకపోయేసరికి.. హరీశ్ కాంగ్రెస్ లోకి వెళ్లాలని ప్లాన్ చేసినట్లు నాని తెలిపాడు. ఈ విషయం తెలిసిన కేసీఆర్.. హరీశ్ ను జైల్లో పెట్టిస్తానని హెచ్చరించినట్లు నాని ఆరోపించారు. కేసీఆర్ ను విమర్శిస్తుంటే హరీశ్ రావు సంబరపడుతున్నాడని.. మరోసారి ఇలా మాట్లాడితే తగిన విధంగా స్పందిస్తామని హెచ్చరించారు పేర్ని నాని.

నిన్న ఏపీ నేతలను ఉద్దేశించి మాట్లాడని హరీశ్.. ఇద్దరు నేతల వల్లే ఏపీ బొక్కబోర్లా పడిందని.. మాజీ సీఎం చంద్రబాబు, ప్రస్తుత సీఎం జగన్‌మోహన్ రెడ్డిపై పరోక్షంగా కామెంట్స్ చేశారు. వాళ్లది ప్రచారం ఎక్కువ.. పని తక్కువ అని.. కేసీఆర్‌ది మాత్రం చేతల ప్రభుత్వం అన్నారు. ఈ వ్యాఖ్యలకు కౌంటర్ గా పేర్ని నాని హరీశ్ పై మండిపడ్డారు.

Updated : 11 Jun 2023 7:13 PM IST
Tags:    
Next Story
Share it
Top