Home > Social > ‘బక్రిద్’ వివాదంలో యాంకర్​ రష్మీ.. ఫైర్ అవుతున్న నెటిజన్స్

‘బక్రిద్’ వివాదంలో యాంకర్​ రష్మీ.. ఫైర్ అవుతున్న నెటిజన్స్

‘బక్రిద్’ వివాదంలో యాంకర్​ రష్మీ.. ఫైర్ అవుతున్న నెటిజన్స్
X

యాంకర్ రష్మీ గౌతమ్.. జబర్దస్త్ షో ద్వారా ప్రేక్షకులకు మరింత దగ్గరయింది. తన అందం, అభినయంతో పాటు.. పలు సినిమాల్లో నటించి తనదైన ముద్ర వేసింది. స్వతహాగా జంతు ప్రేమికురాలైన రష్మీ.. మూగ జీవాలను హింసిస్తే అసలు చూస్తూ ఊరుకోలేదు. ఆ హింసను ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతుంటారు. ఈ క్రమంలోనే.. ఒక్కోసారి ఆమె చేసే ట్వీట్లు, పోస్ట్ లు మిస్ ఫైర్ అవుతుంటాయి.

తాజాగా, రష్మీ ఓ వర్గం వారు చేసిన పనిని విమర్శిస్తూ చేసిన ట్వీట్ పై నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. గురువారం (జూన్ 29) బక్రిద్ సందర్భంగా చాలామంది మాంసం తినడానికి మొగ్గు చూపుతుంటారు. ఈ సందర్భంగా.. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన రష్మి.. ‘పండగల పేరుతో జంతు బలులు ఆపాలని, వాటిదీ ప్రాణమేన’ని కోరింది. దీనిపై స్పంధించని నెటిజన్స్.. ‘నీకు పండగలప్పుడే జంతువులపై ప్రేమ పుట్టుకొస్తుందా’ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. జంతువుల మాంసాన్ని బ్రాండ్ గా చేసి అమ్ముతున్న బడా కంపెనీలపై ఎందుకు ప్రశ్నించట్లేదని అన్నారు. ఇవన్నీ పబ్లిసిటీ కోసమే చేస్తున్నావని రష్మిపై మండిపడ్డారు.






Updated : 30 Jun 2023 9:14 PM IST
Tags:    
Next Story
Share it
Top