Home > క్రైమ్ > కూతురిని ప్రేమించాడని కాళ్లుచేతులు కట్టేసి కాల్చేశారు..

కూతురిని ప్రేమించాడని కాళ్లుచేతులు కట్టేసి కాల్చేశారు..

కూతురిని ప్రేమించాడని కాళ్లుచేతులు కట్టేసి కాల్చేశారు..
X

పెద్దల ఇష్టం లేని ప్రేమ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. తన కూతురుని ఓ కుర్రాడు ప్రేమించడం భరించలేని ఓ వ్యక్తి అతణ్ని కిడ్నాప్ చేసి కాళ్లు చేతులు కట్టేసి సజీవ దహనం చేయించాడు. బాధితుడు ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ఉద్యాననగరి బెంగళూరులో ఈ ఘోరం జరిగింది. అమ్మాయి, అబ్బాయిలది ఒకే కులం కావడంతోపాటు బంధువులు కావడం గమనార్హం.

ఆర్ఆర్ నగరకు చెందిన శశాంక్ (19) అనే విద్యార్థి ఏసీఎస్ కాలేజీలో కంప్యూటర్ సైన్స్ తొలి సంవత్సరం చదువుతున్నాడు. అతడు మైసూరుకు చెందిన అమ్మాయిని ప్రేమించాడు. తన కూతురుకు దూరంగా ఉండాలని అమ్మాయి తండ్రి శశాంక్‌ను చాలాసార్లు హెచ్చరించాడు. శశాంక్ ఇనివారం కాలేజీ దగ్గర బస్సు స్టాప్‌లో ఉండగా కారులో వచ్చిన దుండగులు కిడ్నాప్ చేశారు. తర్వాత నగర శివారులోని కనిమినికే టోల్ ప్లాజ్ సమీపంలో కాళ్లు చేతులు కట్టేసి పెట్రోల్ పోసి కాల్చేశారు. తీవ్ర గాయాలపాలైన శశాంక్‌ను స్థానికులు గుర్తించిగా, పోలీసులు విక్టోరియా ఆస్పత్రికి తరలించారు. బాధితుడి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. శశాంక్ తండ్రి ఫిర్యాదుపై పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఒకడు శశాంక్‌కు, అమ్మాయికి దగ్గరి బంధువు. ఈ ఘోరానిక పాల్పడిన వారిని కఠినంగా శిక్షిస్తామని హోం మంత్రి పరమేశ్వర్ హామీ ఇచ్చారు.

Updated : 17 July 2023 9:07 AM IST
Tags:    
Next Story
Share it
Top