బిగ్ బాస్ సీజన్-7 వచ్చేస్తోంది
X
బుల్లితెర క్రేజీ షో మళ్ళీ వచ్చేస్తోంది. సీజన్ 6 తర్వాత ఇక ఆగిపోతుంది. అనుకున్నారు. బోర్ కొట్టేసింది...జనాలు మళ్ళీ చూడరు అన్నారు. కానీ అందరి అంచనాలనూ తారుమారు చేస్తూ బిగ్ బాస్ 7 ఉంటుంది అంటూ మేకర్స్ ప్రోమోను విడుదల చేశారు.
బిగ్ బాస్ సీజన్ 6 అట్టర్ ఫ్లాప్. కంటెస్ట్ లూ బాగోలేరు....నాగార్జున హోస్టింగ్ కూడా చెత్తగా ఉందంటూ విమర్శలు వచ్చాయి. టీఆర్పీ రేటింగ్స్ కూడా పెద్దగా ఏమీ రాలేదు. దీంతో ఇక మీదట బిగ్ బాస్ ఉండదు అనుకున్నారు. మేకర్స్ కూడా సీజన్ 6 తర్వాత సైలంట్ గా ఉండిపోయారు. దాని గురించి ఎక్కడా మాట్లాడలేదు. కానీ ఇప్పుడు హఠాత్తుగా ప్రోమోను విడుదల చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు.
మామూలుగా బిగ్ బాస్ స్టార్ అవుతుందంటే బోలెడంత హాడావుడి ఉంటుంది. హోస్ట్ తో ప్రోమో చేయించి మరీ విడుదల చేస్తారు. కంటెస్టెంట్ లు వీళ్ళే అంటూ ఊహాగానాలతో ఇంటర్నెట్ మోత మోగిపోతుంది. ఇప్పుడు అదేమీ లేకుండా కేవలం బిగ్ బాస్ 7 వస్తోంది అంటూ ప్రోమో ను రిలీజ్ చేశారు మేకర్స్. ఎప్పటిలా కాకుండా ఈ సారి కొత్తగా, పూర్తిగా ఎంటర్టైన్ మెంట్ ఇచ్చే విధంగా వస్తున్నామని చెప్పారు. ఈ సీజన్ లో అభిమానులకు ఎమోషన్స్ తో పాటూ సర్ ప్రైజ్ లు కూడా ఉంటాయని తెలిపారు. ఆల్ మోస్ట్ రోలర్ కోస్టర్ రైడ్ లా ఉంటుందని సంకేతాలు ఇస్తున్నారు. మరొక సర్ ప్రైజింగ్ విషయం ఏంటంటే... ఈసారి కూడా అక్కినేని నాగార్జునే హోస్ట్ గా ఉంటారని తెలుస్తోంది.