ఎర్రచందనం స్మగ్లింగ్.. జజర్దస్త్ కమెడియన్ అరెస్ట్
X
జబర్దస్త్ కామెడీ షో ద్వారా చాలామంది ఆర్టిస్ట్ లు వెండి తెరపై అవకాశాలు దక్కించుకున్న విషయం తెలిసిందే. ఎంతో మంది వెలుగులోకి వచ్చారు. జబర్దస్త్ లో లేడీ గెటప్ లు వేస్తూ తనకంటూ ఓ ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు కమెడియన్ హరి. తాజాగా అతను ఓ కేసులో బుక్ అయ్యాడు. ఎర్ర చందనం స్మగ్లింగ్ లో అతనిపై కేసు నమోదయింది. హరి ముఠాకు చెందిన కిషోర్ ను చిత్తూరు పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్దనుంచి రూ. 60 లక్షలు విలువ చేసే ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.
పరారిలో ఉన్న కమెడియన్ హరి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటికే హరిపై ఎర్రచందనం అక్రమ రవాణాపై పలు కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. హరిపై చిత్తూరు పోలీస్ స్టేషన్ లో గతంలోనే స్మగ్లింగ్ కేసులతో పాటు, పలు కేసులు నమోదు చేశారు. ఎర్రచందనం స్మగ్లింగ్ ద్వారా హరి పెద్ద మొత్తంలో సంపాధించాడని పోలీసులు ఆరోపిస్తున్నారు.