రాకేశ్ మాస్టర్ మూడో భార్యపై దాడి..
X
ఆనారోగ్యం కారణంగా టాలీవుడ్ కొరియోగ్రాఫర్ రాకేశ్ మాస్టర్ ఈమధ్యనే ఆకస్మాత్తుగా మరణించిన విషయం తెలిసిందే. ఆయన చనిపోయిన తర్వాత కూడా రాకేశ్ మాస్టర్ పేరుతో చాలా మంది యూట్యూబర్లు అనేక వివాదాస్పదమైన కథనాలను ప్రసారం చేశారు. అంతే కాదు ఆయన ఫ్యామిలీకి సంబంధించిన అనేక విషయాలు బయటికి వచ్చాయి. ఇదిలా ఉండగా తాజాగా రాకేష్ మాస్టర్ మూడో భార్యనని చెప్పుకుంటున్న లక్ష్మి పై పలువురు మహిళలు దాడి చేశారు. హైదరాబాద్‌లోని పంజాగుట్ట ఏరియాలో లక్ష్మిపై ఒక్కసారిగా ఐదుగురు మహిళలు అటాక్ చేశారు . రోడ్డుమీదే ఆమెను చితక్కొట్టారు.
స్కూటర్‌పై వెళ్తున్న లక్ష్మిపై లల్లీ అనే యూట్యూబర్ మరో నలుగురితో కలిసి దాడి చేసింది. నడిరోడ్డుపైనే జుట్టు లాగి ఇష్టమొచ్చినట్టు లక్ష్మిని కొట్టింది. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆపై లక్ష్మిని స్టేషన్‌కు తరలించారు. కొంత సమయానికి లల్లీతో పాటు నలుగురు మహిళలు స్టేషన్‌కు వచ్చారు. లక్ష్మిని కొట్టింది తామే అని ఒప్పుకోవడంతో పాటు ఎందుకు కొట్టాల్సి వచ్చిందో కూడా పోలీసులకు వివరించారు. తనపై దాడి చేశారని లక్ష్మి కేసు పెట్టగా..మహిళలు కూడా తమను ఇష్టంవచ్చినట్లు యూట్యూబ్‌లో తిడుతోందని లక్ష్మిపై కేసు పెట్టారు.
" నన్ను రెండు నెలలుగా చంపేస్తామని బెదిరిస్తున్నారు. వీరందిరకి రూ.లక్ష సుపారీ ఇచ్చి నన్ను కొట్టించారు. నెల్లూరుకు చెందిన భారతి అనే మహిళ ఇదంతా చేయించింది. నా యూట్యూబ్ ఛానల్‌ను మూసేయాలని కొంతకాలంగా బెదిరిస్తున్నారు. దుర్గ, లల్లీ,పెరుగు పెద్దమ్మ, నెల్లూరుకు చెందిన భారతిలే నాపై దాడి చేశారు" అని రాకేశ్ మాస్టర్ భార్య అని చెప్పుకుంటున్న లక్ష్మి తెలిపింది.
లక్ష్మిపై దాడి చేసిన లల్లీ స్పందిస్తూ.." దీనంతటికి కారణం లక్ష్మి. ఆమెతో నాకు ముందు ఎలాంటి గొడవలు లేవు. నా కూతురును ఉద్దేశిస్తూ యూట్యూబ్‌లో లక్ష్మి బ్యాట్ కామెంట్స్ చేస్తోంది. బూతులు తిడుతోంది. అందుకే ఆమెను క్టొటాము. ఆమె మాట్లాడే మాటల వల్ల నా కూతురు మానసికంగా బాధపడుతోంది" అని లల్లీ తెలిపింది.