Home > Social > కాబోయే భార్యను పరిచయం చేసిన జబర్దస్త్‌ కమెడియన్‌

కాబోయే భార్యను పరిచయం చేసిన జబర్దస్త్‌ కమెడియన్‌

కాబోయే భార్యను పరిచయం చేసిన జబర్దస్త్‌ కమెడియన్‌
X

జబర్దస్త్‌ కమెడియన్‌, కెవ్వు కార్తిక్‌ త్వరలో పెళ్లిపీటలెక్కనున్న విషయం తెలిసిందే. ఇటీవల సోషల్‌ మీడియా ద్వారా తన వివాహ విషయాన్ని తెలిపాడు. తాజాగా తన భార్యను కెవ్వు కార్తీక్ పరిచయం చేశాడు. భార్యతో తీసుకున్న ఫోటోలను ఇన్ స్టా వేదికగా షేర్ చేశాడు. ఫోటోలతో పాటు ఓ ఎమోషనల్ ట్‌ కూడా రాసుకొచ్చాడు. "పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయి అంటే అప్పట్లో నేను నమ్మలేదు. కానీ, ఇప్పుడు అది నిజమేననిపిస్తుంది. ఇద్దరు వ్యక్తులు, రెండు జీవితాలు, భిన్నాభిప్రాయాలు, విభిన్నమైన ప్రపంచాలు.. ఒక్కటిగా కలిసి కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టడం ఆనందంగా ఉంది. ఫైనల్‌గా నా జీవిత భాగస్వామి సిరిని పరిచయం చేసే సమయం ఆసన్నమైంది’’ అని తెలిపాడు. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో కెవ్వు కార్తీక్ పోస్ట్ వైరల్‌గా మారింది.



కెవ్వు కార్తీక్ చేసుకోబోయే అమ్మాయి ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా తెలుస్తోంది. అతడు కూడా గతంలో ఓ మంచి ఉద్యోగం చేసి..నటనతో ఉన్న ఇష్టంతో బయటకు వచ్చేశాడు. మిమిక్రీ షోలు చేస్తూ నలుగురిలో గుర్తింపు సంపాదించాడు. అనంతరం జబర్దస్త్‌లోకి ఎదిగి టీమ్‌ లీడర్‌గా కొనసాగుతున్నాడు. కెవ్వు కార్తీక్ కు సినిమాలో కూడా అవకాశాలు వస్తున్నాయి. గతేడాది విడుదలైన ‘ముఖచిత్రం’, ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘నేను స్టూడెంట్‌ సర్‌’ చిత్రాలతో ఆయన ప్రేక్షకులను అలరించారు.





Updated : 4 Jun 2023 3:21 PM IST
Tags:    
Next Story
Share it
Top