Home > క్రీడలు > చరిత్ర సృష్టించాడు.. ఒకే ఓవర్లో 6 వికెట్లు.. అన్నీ క్లీన్ బౌల్డ్లే

చరిత్ర సృష్టించాడు.. ఒకే ఓవర్లో 6 వికెట్లు.. అన్నీ క్లీన్ బౌల్డ్లే

చరిత్ర సృష్టించాడు.. ఒకే ఓవర్లో 6 వికెట్లు.. అన్నీ క్లీన్ బౌల్డ్లే
X

క్రికెట్ లో హాట్రిక్ వికెట్లు తీయడం చాలా అరుదు. అలాంటిది ఇంగ్లండ్ కు చెందిన ఓ ఓలీ వైట్ హౌజ్ అనే 12 ఏళ్ల కుర్రాడు.. ఒకే ఓవర్ లో డబుల్ హైట్రిక్ తీశాడు. అది కూడా అన్నీ క్లీన్ బౌల్డ్ లే. దాంతో చరిత్రలోనే ఒకే ఓవర్లో ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్ గా రికార్డుకెక్కాడు. బ్రోమ్స్ గ్రోవ్ టీంకు ప్రాతినిథ్యం వహిస్తున్న వైట్ హౌజ్.. కుక్ హిల్ తో జరిగిన మ్యాచ్ లో ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్ లో వైట్ హౌజ్ మొత్తం 8 వికెట్లు తీసుకోవడంతో పాటు ఒక్క రన్ కూడా ఇవ్వలేదు. ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి. ఈ విషయాన్ని బ్రోమ్స్‌గ్రోవ్ తన అధికారికి ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసింది.

Updated : 16 Jun 2023 7:22 PM IST
Tags:    
Next Story
Share it
Top