Home > క్రీడలు > IND vs SA: కింగ్స్మీడ్లో ఎడతెరిపిలేని వర్షం.. మ్యాచ్ రద్దైతే..?

IND vs SA: కింగ్స్మీడ్లో ఎడతెరిపిలేని వర్షం.. మ్యాచ్ రద్దైతే..?

IND vs SA: కింగ్స్మీడ్లో ఎడతెరిపిలేని వర్షం.. మ్యాచ్ రద్దైతే..?
X

డర్బన్ వేదికగా జరగాల్సిన సౌతాఫ్రికా- భారత్ మ్యాచ్ కు అంతరాయం ఏర్పడింది. ఎడతెరిపి లేని వర్షం కారణంగా టాస్ డిలే అయింది. పిచ్ ను కవర్స్ తో కప్పి ఉంచారు. ఉదయం నుంచి కురుస్తున్న వర్షం.. మ్యాచ్ సమయానికి తగ్గుముఖం పడుతుందని అనుకున్నా.. అది జరగలేదు. అయితే వర్షం తగ్గితే ఓవర్లను కుందించి మ్యాచ్ ను కొనసాగిస్తారు. ఏదీ సాధ్యపడకపోతే.. మ్యాచ్ ను రద్దుచేస్తారు. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ లకు బీసీసీఐ రెస్ట్ ఇచ్చింది. టీ20లకు తాత్కాలిక కెప్టెన్ గా ఉన్న హార్దిక్ పాండ్యా.. గాయం కారణంగా జట్టుకు దూరంగా ఉన్నాడు. దీంతో ఈ మ్యాచ్ లో టీమిండియాను సూర్యకుమార్ యాదవ్ నడిపిస్తున్నాడు.

జట్ల అంచనా:

సౌతాఫ్రికా ప్లేయింగ్ XI: రీజా హెండ్రిక్స్, మాథ్యూ బ్రీట్జ్కే, ట్రిస్టన్ స్టబ్స్, ఐడెన్ మార్క్రామ్ (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, ఆండిల్ ఫెహ్లుక్వాయో, కేశవ్ మహరాజ్, గెరాల్డ్ కోయెట్జీ, నాండ్రే బర్గర్, తబ్రైజ్ షమ్సీ

టీమిండియా ప్లేయింగ్ XI: యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రింకూ సింగ్, జితేష్ శర్మ, రవీంద్ర జడేజా, దీపక్ చాహర్, రవి బిష్ణోయ్, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్


Updated : 10 Dec 2023 8:33 PM IST
Tags:    
Next Story
Share it
Top