Home > క్రీడలు > ఆ అద్భుతానికి 40 ఏళ్లు..వన్డే ప్రపంచకప్‎లో విశ్వవిజేతగా భారత్

ఆ అద్భుతానికి 40 ఏళ్లు..వన్డే ప్రపంచకప్‎లో విశ్వవిజేతగా భారత్

ఆ అద్భుతానికి 40 ఏళ్లు..వన్డే ప్రపంచకప్‎లో విశ్వవిజేతగా భారత్
X

క్రికెట్ చరిత్రలో మొదటిసారి వన్డే ప్రపంచకప్ సాధించిన రోజు ఇది. 1983 వన్డే ప్రపంచకప్‌ ఫైనల్లో అరివీర భయంకరమైన వెస్టిండీస్‎ ఆటగాళ్లకు ఓటమి రుచి చూపించి కపిల్ డెవిల్స్ హిస్టరీని క్రియేట్ చేసింది. క్రికెట్ రంగంలో దేశానికి ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చారు కపిల్ అండ్ టీమ్. ఈ అద్భుతం జరిగి నేటికి 40 ఏళ్లు అవుతోంది. సరిగ్గా ఇదే రోజు మనోళ్లు అంతర్జాతీయ స్టేడియంలో తమదైన ఆటతీరుతో దుమ్ము దులిపేశారు. అందరిని ఆశ్చర్యపరిచారు. అంచనాలను మించి, అడ్డంకులను దాటుకుని, అవమానాలను పక్కనపెట్టి క్రికెట్‏లో భారత్‌ మొదటిసారిగా విశ్వవిజేతగా నిలిచిన రోజు ఇది. ఇదో మరుపురాని ఘట్టం. ఈ విజయంగా చరిత్రలో నిలిచిపోయింది. ఎంతో మంది క్రీడాకారులకు స్ఫూర్తిని అందించింది.


1975, 1979లో రెండు సార్లు జరిగిన వన్డే ప్రపంచకప్ పోటీల్లో వెస్టిండీస్ రెండు సార్లు విజేతగా నిలిచింది. కానీ 1983లో ఇంగ్లాండ్‌, వేల్స్‌‎లో జరిగిన ప్రపంచకప్‌ మ్యాచ్‎లో కపిల్‌ దేవ్ అండ్ సేనాతో తలపడి ఘోర పరాజయాన్ని తన అకౌంట్‎లో వేసుకుంది. ఈ మ్యాచ్‏లో భారత జట్టు అనూహ్య ప్రదర్శనతో ఓ రేంజ్‎లో అదరగొట్టింది. గ్రూప్‌- బిలో ఆరు మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలు, రెండు ఓటములతో వెస్టిండీస్‌ అనంతరం రెండో స్థానంతో నాకౌట్‌కు చేరింది భారత్‌. గ్రూప్‌ మ్యాచ్‌లో విండీస్‌ను టీమ్ ఇండియా ఓటమి రుచి చూపించడం విశేషం.


సెమీస్‌లో భారత్‌ ఇంగ్లాండ్‌ను మట్టికరిపించి.. ఫైనల్స్‎లో విండీస్‌పై విరుచుకుపడి హిస్టారిక్ విజయాన్ని అందుకుంది. వన్డే ప్రపంచ కప్‎లో ఈ విజయాన్ని గుర్తు చేసుకుంటూ 1983 భారత హీరోలు మళ్లీ ఏకమై సెలబ్రెషన్స్‎కు రెడీ అయ్యారు. ఆనాటి జట్టు ఆటగాళ్లతో కలిసి దిగిన ఫొటోలను సునీల్‌ గావస్కర్‌ తన సోషల్ మీడియా అకౌంట్‎లో పోస్ట్ చేశాడు. ఈ ఫోటోలో కపిల్‌ దేవ్‌, దిలీప్‌ వెంగ్‌సర్కార్‌, శ్రీకాంత్‌, సందీప్‌ పాటిల్‌, మొహిందర్‌ అమర్‌నాథ్‌, మదన్‌ లాల్‌, సయ్యద్‌ కిర్మాణి, బల్విందర్‌ సింగ్‌, రోజర్‌ బిన్నీలతో పాటు అప్పటి టీమ్‌ మేనేజర్‌ మాన్‌ సింగ్‌ కూడా ఉన్నారు. ఇదిలా ఉంటే తమ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా 1983 ప్రపంచకప్‌ విజేతలను అదానీ గ్రూప్ సత్కరించి .. ఈ సంవత్సరం వన్డే ప్రపంచకప్‌ నేపథ్యంలో ‘జీతేంగే హమ్‌’ పేరుతో ప్రమోషన్స్ కూడా కూడా మొదలుపెట్టేసింది.





Updated : 25 Jun 2023 3:07 AM GMT
Tags:    
author-thhumb

Kiran

కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.


Next Story
Share it
Top