2024లో కోహ్లీని ఊరిస్తున్న రికార్డులు ఇవే!
X
రన్ మెషిన్ విరాట్ కోహ్లీ.. రికార్డుల రారాజుగా పేరు సంపాధించుకున్నాడు. క్రికెట్ లో ఎవరికి సాధ్యం కాని రికార్డులను తన సొంతం చేసుకున్నాడు. గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ టెండూల్కర్ ముందు.. సచిన్ రికార్డును బద్దలు కొట్టి వన్డేల్లో 50 సెంచరీలు సాధించాడు. బ్యాడ్ ఫామ్ తర్వాత తిరిగి పుంజుకున్న కోహ్లీ.. ఐపీఎల్, ఆసియా కప్, వన్డే వరల్డ్ కప్స్ లో అదరగొట్టి టాప్ స్కోరర్ గా నిలిచాడు. 2023లో కోహ్లీ అన్ని ఫార్మాట్లలో కలిపి 35 మ్యాచ్‌లు ఆడి 2048 పరుగులు చేశాడు. అందులో 8 సెంచరీలు, 10 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 2024లోనూ కోహ్లీ అదే ఫామ్ ను కొనసాగించాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ క్రమంలో కోహ్లీ కొత్త ఏడాది కొన్ని రికార్డులపై కన్నేశాడు. అవేంటంటే..
కోహ్లీ బ్రేక్ చేయబోయే రికార్డులు:
వన్డేల్లో ఇంకా 152 పరుగులు చేస్తే.. అత్యంత వేగంగా 14,000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా నిలుస్తాడు. ఈ జాబితాలో సచిన్ 350 మ్యాచుల్లో ఈ మైలు రాయిని చేరుకోగా.. కోహ్లీ ప్రస్తుతం 292 మ్యాచ్ లే ఆడాడు.
కోహ్లీ మరో 35 పరుగులు చేస్తే టీ20 క్రికెట్‌లో 12000 పరుగులు చేసిన తొలి భారత ఆటగాడిగా రికార్డుకెక్కుతాడు. ఈ జాబితాలో క్రిస్ గేల్ (12,993), కీరన్ పొలార్డ్ (12,390) పరుగులతో కోహ్లీ కంటే ముందున్నారు.
సౌతాఫ్రికా సిరీస్ తర్వాత ఇంగ్లాంజ్ జట్టు టీమిండియా పర్యటనకు రానుంది. సిరీస్ లో భాగంగా ఐదు టెస్ట్ మ్యాచులు ఆడనుంది. ఈ సిరీస్ లో విరాట్ రాణించి.. 544 పరుగులు చేస్తే సచిన్ ను అధిగమిస్తాడు. ఇంగ్లాండ్ పై సచిన్ టెస్టుల్లో 2535 పరుగులు చేయగా.. ఈ రికార్డ్ బ్రేక్ చేయడానికి కోహ్లీకి ఇంకా 544 పరుగులు కావాలి.
ఇంగ్లాండ్ పై మరో 21 పరుగులు చేస్తే.. అన్ని ఫార్మట్లలో ఇంగ్లాండ్ పై అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా విరాట్ కోహ్లీ నిలుస్తాడు. మరో 30 పరుగులు చేస్తే.. అంతర్జాతీయ క్రికెట్ లో ఇంగ్లాండ్ పై 4000 పరుగులు పూర్తిచేసిన క్రికెటర్ గా నిలుస్తాడు.
న్యూజిలాండ్ పై మరో సెంచరీ చేస్తే.. ఆ జట్టుపై అంతర్జాతీయ క్రికెట్ లో అత్యధిక సెంచరీలు చేసిన క్రికెటర్ గా రికార్డ్ సృష్టిస్తాడు. ప్రస్తుతం కోహ్లీ, సచిన్ తొమ్మిది సెంచరీలు చేశారు.
బంగ్లాదేశ్ పై మరో 383 పరుగులు చేస్తే.. సచిన్ 820 పరుగులను అధిగమించి భారత్ తరుపున అత్యధిక రన్స్ చేసిన ఆటగాడిగా నిలుస్తాడు.