Home > క్రీడలు > సెమీస్కే రికార్డ్ మోత.. మరి ఫైనల్ పరిస్థితి ఏంటి?

సెమీస్కే రికార్డ్ మోత.. మరి ఫైనల్ పరిస్థితి ఏంటి?

సెమీస్కే రికార్డ్ మోత.. మరి ఫైనల్ పరిస్థితి ఏంటి?
X

న్యూజిలాండ్ తో జరిగిన అమీతుమీ మ్యాచ్ లో టీమిండియా 70 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటర్లు విశ్వరూపం ప్రదర్శించగా 398 పరుగులు చేసింది భారత్. 399 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 327 పరుగులకే కుప్పకూలింది. షమీ బంతితో నిప్పులు చెరిగి కివీస్ ను కుప్పకూల్చాడు. కాగా మ్యాచ్ హాట్ స్టార్ స్ట్రీమింగ్ లో రికార్డ్ సృష్టించింది. భారత్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో 5.1 కోట్లమంది వీక్షించగా.. కివీస్ బ్యాటింగ్ సమయంలో ఏకంగా 5.3 కోట్ల మంది ఆన్ లైన్ వీక్షించారు. గతంలో ఐపీఎల్ 2023 చెన్నై, గుజరాత్ జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ ను 3.2 కోట్ల మంది జియో సినిమాలో చూశారు. ఆ రికార్డ్ అక్టోబర్ 22న జరిగిన భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన మ్యాచ్ ను 3.5 కోట్ల మంది హాట్ స్టార్ లో చూశారు. కాగా నిన్న జరిగిన మ్యాచ్ కే ఎక్కువ మంది ఆన్ లైన్ (ఓటీటీ)లో వీక్షించారు. ఈ క్రమంలో సెమీస్ కే రికార్డ్ బద్దలైతే.. మరి నవంబర్ 19న జరిగే ఫైనల్ మ్యాచ్ పరిస్థితి ఏంటని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.





Updated : 16 Nov 2023 2:10 PM IST
Tags:    
Next Story
Share it
Top