AUS vs BAN: ఆసీస్పై విరుచుకుపడుతున్న బంగ్లా.. టాస్ ఓడి బ్యాటింగ్ చేస్తూ..
X
ప్రపంచకప్ లో భాగంగా లీగ్ స్టేజ్ లో ఇవాళ డబల్ హెడ్డర్ మ్యాచ్ లు జరుగుతున్నాయి. మొదట మ్యాచ్ పూణే వేదికగా ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతుంది. కాగా టాస్ గెలిచిన ఆసీస్ బౌలింగ్ ఎంచుకుంది. ఈ వరల్డ్ కప్ తమ చివరి మ్యాచ్ లో బ్యాటింగ్ కు వచ్చిన బంగ్లా.. ఆసీస్ పై విరుచుకుపడుతుంది. 15 ఓవర్లలో వికెట్ నష్టానికి 100 పరుగులు చేసింది. ఓపెనర్ తనిజ్ హసన్ (36, 34 బంతుల్లో) తర్వరగా ఔట్ అయ్యాడు. మరో ఓపెనర్ లిట్టన్ దాస్ (35), కెప్టెన్ నజ్ముల్ షాంటో (14)తో కలిసి ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్తున్నారు. సీన్ అబాట్ బంగ్లా మొదటి వికెట్ పడగొట్టాడు.
తుది జట్లు:
బంగ్లాదేశ్ (ప్లేయింగ్ XI): తాంజిద్ హసన్, లిట్టన్ దాస్, నజ్ముల్ హొస్సేన్ శాంటో(సి), మహ్మదుల్లా, ముష్ఫికర్ రహీమ్(w), తౌహిద్ హృదయ్, మెహిదీ హసన్ మిరాజ్, మహేదీ హసన్, నసుమ్ అహ్మద్, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రహ్మాన్
ఆస్ట్రేలియా (ప్లేయింగ్ XI): డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్, మార్నస్ లాబుషాగ్నే, జోష్ ఇంగ్లిస్(w), మార్కస్ స్టోయినిస్, సీన్ అబాట్, పాట్ కమిన్స్(సి), ఆడమ్ జంపా, జోష్ హాజిల్‌వుడ్
Kiran
కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.