Home > క్రీడలు > పెద్ద తప్పు చేశా...కోహ్లీ మరోసారి తండ్రి కాబోతున్నాడన్న కామెంట్లపై ఏబీడీ క్లారిటీ

పెద్ద తప్పు చేశా...కోహ్లీ మరోసారి తండ్రి కాబోతున్నాడన్న కామెంట్లపై ఏబీడీ క్లారిటీ

పెద్ద తప్పు చేశా...కోహ్లీ మరోసారి తండ్రి కాబోతున్నాడన్న కామెంట్లపై ఏబీడీ క్లారిటీ
X

దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్‌ చేసిన కామెంట్లు మరోసారి వైరల్ అవుతున్నాయి. విరాట్ కోహ్లీ మరోసారి తండ్రి కాబోతున్నాడని గతంలో తను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నట్లు చెప్పి బాంబు పేల్చాడు.

భారత్, ఇంగ్లాండ్‌ తొలి రెండు టెస్టులకు వ్యక్తిగత కారణాలతో విరాట్ కోహ్లీ (Virat Kohli) దూరమైనట్లు బీసీసీఐ తెలిపింది. అయితే మిగతా టెస్టులకూ విరాట్ అందుబాటులో ఉంటాడా లేదా అని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. దీనిపై ఇప్పటి వరకూ ఈ విషయంపై విరాట్‌ గానీ, టీమ్‌ఇండియా మేనేజ్‌మెంట్ గానీ స్పందించలేదు. అయితే, విరుష్క జోడీ మరోసారి పేరెంట్స్ అవుతున్నట్లు ఇటివల ఏబీ డివిలర్స్ తెలిపాడు. కుటుంబంతో టైం స్పెండ్ చేసేందుకు టెస్టులకు దూరమైనట్లు చెప్పాడు. కానీ ఇప్పుడు ఏబీడీ తన మాటాలను వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపాడు. ప్రస్తుతం బుల్లి కింగ్ రాబోతుండని విరాట్ ఫ్యాన్స్ ఇప్పటికే తెగ సంబురాలు చేసుకుంటున్నారు. అయితే తాజాగా ఏబీడీ తన యూట్యూబ్‌ ఛానల్‌లో చేసిన వ్యాఖ్యలు తప్పు అని చెప్పడంతో అభిమానులు అయోమయంలో పడ్డారు.

కొన్నిసార్లు కుటుంబానికి మొదటి ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుందని చెప్పాడు. కానీ, గత వీడియోలో పెద్ద పొరపాటు చేశానని.. తనకు అందిన సమాచారమంతా తప్పేనని..అందులో ఎలాంటి నిజం లేదని కుండ బద్దలు కొట్టాడు. అంతేగాక ఈ విషయంపై విరాట్ కుటుంబమే స్పష్టత ఇస్తుందని భావిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. అక్కడ ఏం జరుగుతుందనేది ఎవరికీ తెలియదని..కోహ్లీ త్వరగా జట్టులోకి రావాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు. విరామం తీసుకోవడానికి కారణమేదైనా సరే.. మరింత దృఢంగా తిరిగి రావాలని ఏబీడీ చెప్పాడు.

అయితే గత యూట్యూబ్ లైవ్‌లో ఏబీ డివిలియర్స్‌ అభిమానులతో సరదాగా మాట్లాడాడు. అందులో ఓ అభిమాని విరాట్ కోహ్లీతో మాట్లాడారా? అతను బాగున్నారా? అని ప్రశ్నించాడు. దానికి జవాబు చెబుతూ ఇటీవల కోహ్లీతో చాట్ చేశానని..తను చాలా బాగున్నాడని చెప్పాడు. ప్రస్తుతం అతను తన ఫ్యామిలితో కొంత సమయం గడుపుతున్నాడని చెప్పాడని..అందుకే ఇంగ్లాండ్‌తో మొదటి, రెండు టెస్టు మ్యాచ్‌లకు దూరంగా ఉన్నాడని అనుకుంటున్నట్లు తెలిపాడు. అంతేగాక కోహ్లీ రెండో బిడ్డ ఈ ప్రపంచంలోకి రాబోతున్న మాట వాస్తవమేనని...ఇప్పుడు అతడు తన కుటుంబంతో ఉండటం ముఖ్యమని ఏబీడీ తెలిపాడు. కానీ ఇప్పుడు ఏబీడీ ప్లేట్ ఫిరాయించడంతో.. కోహ్లీ జట్టుకు దూరంగా ఉండటానికి గల కారణాలేంటో తెలియడం లేదు.

Updated : 9 Feb 2024 2:10 PM IST
Tags:    
Next Story
Share it
Top