Home > క్రీడలు > ICC Worldcup2023: వరల్డ్కప్కు మారిన జెర్సీ.. త్రివర్ణ పతాకంతో..

ICC Worldcup2023: వరల్డ్కప్కు మారిన జెర్సీ.. త్రివర్ణ పతాకంతో..

ICC Worldcup2023: వరల్డ్కప్కు మారిన జెర్సీ.. త్రివర్ణ పతాకంతో..
X

వరల్డ్ కప్ కోసం టీమిండియా సన్నద్ధం అవుతుంది. ప్లేయర్లంతా ఫిట్ నెస్ సాధిస్తూ.. మ్యాచుల్లో రాణించాలని చూస్తున్నారు. నెట్స్ లో శ్రమిస్తున్నారు. ఈసారి స్వదేశంలో టోర్నీ జరుగుతుండే సరికి.. కప్పు ఎలాగైనా కొట్టాలని అభిమానులు ఆశిస్తున్నారు. ప్రస్తుతం వరల్డ్ కప్ కు ప్రాక్టీస్ లో భాగంగా టీమిండియా సెప్టెంబర్ 22 నుంచి ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఇప్పుడు దేశమంతా వరల్డ్ కప్ ఫీవర్ లోనే ఉంది. టికెట్ సేల్స్ నడుస్తున్నాయి. స్టేడియాలు ముస్తాబవుతున్నాయి. ఈ క్రమంలో బీసీసీఐ వరల్డ్ కప్ జెర్సీని విడుదల చేసింది. ఆడిడాస్ స్పాన్సర్షిప్ లో ఈ జెర్సీ రూపుదిద్దుకుంది.

ఈ కొత్త జెర్సీలను లాంచ్ చేస్తూ ‘తీన్ కా డ్రీమ్’ పేరుతో ఓ వీడియోను ట్విటర్ లో పోస్ట్ చేసింది బీసీసీఐ. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా, గిల్.. ఈ వీడియోలో భాగం అయ్యారు. ఈ స్పెషల్ జెర్సీలో భుజంపై ఉండే మూడు లైన్స్ (ఆడిడాస్ లైన్స్)ను.. త్రివర్ణ పతాకాన్ని రిప్రెసెంట్ చేశారు. ఒక్కో లైన్ కు ఒక్కో కలర్ ఇచ్చారు. ర్యాప్ సాంగ్ లో పాట కూడా వినడానికి చాలా బాగుంది. గూస్ బంప్స్ తెప్పిస్తుంది. జెర్సీ బాగుందని, టీమిండియా కప్ గెలవాలంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. అక్టోబర్ 5నుంచి వరల్డ్ కప్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.

Updated : 20 Sept 2023 6:02 PM IST
Tags:    
Next Story
Share it
Top