pak vs afg : పాకిస్తాన్‌పై అఫ్ఘాన్ సంచలన విజయం
X
వరల్డ్ కప్ మ్యాచుల్లో ఇంగ్లండ్‌ను ఓడించి ఔరా అనిపించుకున్న అఫ్గానిస్తాన్ జట్టు మరో సంచలన విజయాన్ని నమోదు చేసింది. పాకిస్తాన్‌కు చుక్కలు చూపించి అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఆదివారం చెన్నైలో జరిగిన మ్యాచ్‌లో పాక్‌పై అఫ్గాన్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. వన్డే క్రికెట్లో పాక్‌పై అఫ్గాన్‌కు ఇది తొలి గెలుపే కాకుండా తొలి భారీ లక్ష్యం కూడా. మొదట పాక్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసింది. అఫ్గాన్ ఆటగాళ్లు కేవలం 2 వికెట్ల నష్టంతో 49 ఓవర్లతో ఆ లక్ష్యాన్ని ఛేదించారు. ఓపెనర్లు రహ్మనుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జాద్రాన్ చెలరేగి ఆడి తొలి వికెట్ పడేసరికి 130 పరుగుల సాధించారు. తర్వాత బ్యాట్ అందుకున్న రహ్మత్ షా, కెప్టెన్ హష్మతుల్లా షాహిది చివరి వరకు తొణక్కుండా విజయం కైవసం చేసుకున్నారు. గుర్బాజ్ 53 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్ బాది 65 పరుగులు నమోద చేశాడు. జాద్రాన్ 113 బాల్స్‌కు పది ఫోర్లతో సహా 87 పరుగులు చేశాడు. రహ్మత్ షా 84 బంతుల్లో 77 పరుగులు(5 ఫోర్లు, 2 సిక్సర్లు), షాహిది 45 బంతుల్లో 48 పరుగులు సాధించారు.