ODI : ఆఫ్ఘన్ మ్యాచ్ ఫిక్సింగ్..? 10 పరుగుల తేడాలో 8 వికెట్లు డౌన్
X
308 పరుగుల భారీ లక్ష్యాన్ని చేందించే క్రమంలో ఆఫ్ఘనిస్తాన్ బోల్తా పడింది. ఒక దశలో 143/3 పటిష్టంగా ఉన్న ఆఫ్ఘన్.. కేవలం 10 పరుగుల వ్యవధిలో మిగిలిన 8 వికెట్లు కోల్పోయింది. 153 పరుగులకే ఆలౌట్ అయింది. 5 ఓవర్ల గ్యాప్ లో చివరి 8 వికెట్లు కోల్పోయి.. 155 పరుగుల భారీ తేడాతో ఓడిపోయింది. దీంతో మరో మ్యాచ్ మిగిలుండగానే.. 2-0తో సిరీస్ కోల్పోయింది. కాగా ఈ మ్యాచ్ చుట్టూ వివాదం నెలకొంది. విజయం దిశగా దూసుకుపోతున్న ఆఫ్ఘన్.. అంత చిత్తుగా ఓడిపోవడం 10 పరుగుల వ్యవధిలో 8 వికెట్లు కోల్పోవడంతో ఆ జట్టు చిత్తైంది. దీంతో ఆఫ్ఘనిస్తాన్ జట్టు మ్యాచ్ ఫిక్సింగ్ చేసిందని అంతా ఆరోపిస్తున్నారు. ఆ జట్టు బ్యాటర్ల కావాలనే చెత్త షాట్లు ఆడి ఔటయ్యారని అంతా అనుకుంటున్నారు. ఎంతపెద్ద జట్టుకైనా చెమటలు పట్టించే ఆఫ్ఘన్.. శ్రీలంకపై ఈ తీరుగా ఔట్ అవ్వడం కూడా ఈ ఆరోపణలకు ఊతమిస్తుంది.
కొన్నేళ్ల వరకు ఆఫ్ఘన్ ఓ పసికూన జట్టు. అయితే చాలా తక్కువ వ్యవధిలో టెస్ట్ నేషన్ స్థాయికి ఎదిగింది. పెద్ద పెద్ద జట్లను సైతం మట్టికరిపించింది. వరల్డ్ కప్ లో ఏకంగా.. ఇంగ్లాండ్, పాకిస్తాన్ జట్లను ఓడించింది. టైటిల్ ఛాంపియన్గా నిలిచిన ఆస్ట్రేలియాను కూడా ఓడించినంత పని చేసింది. శ్రీలంకను చిత్తు చేసింది. ఓ దశలో సెమీస్ కు అర్హత సాధిస్తుంది అనుకున్న క్రమంలో.. తీవ్ర పోటీ మధ్య టోర్నీ నుంచి నిష్క్రమించింది. అలాంటి జట్టు ఇలా ఓడిపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే దీనిపై స్పందించిన ఆఫ్ఘన్ అభిమానులు.. ఇదో బ్యాడ్ డే అని, క్రికెట్ లో ఇలాంటివి కామన్ అని అంటున్నారు. తమ జట్టు మళ్లీ తిరిగి పుంజుకుంటుందని, బదులు తీర్చుకుంటుందని భరోసానిస్తున్నారు.