World Cup 2023: అదరగొట్టిన ఆఫ్ఘాన్.. టీమిండియా టార్గెట్ 273..
X
వరల్డ్ కప్ 2023లో భాగంగా ఇవాళ భారత్ ఆఫ్ఘనిస్తాన్తో తలపడుతోంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో ఆప్ఘాన్ అద్భుతమైన బ్యాటింగ్ చేసింది. 50 ఓవర్లలో 8వికెట్ల నష్టానికి 272 రన్స్ చేసింది. హష్మతుల్లా షాహిదీ, అజ్మతుల్లా ఒమర్జాయ్ హాఫ్ సెంచరీలతో చెలరేగారు. షాహిదీ 82 రన్స్, ఒమర్జాయ్ 62 రన్స్తో తమ జట్టుకు భారీ స్కోర్ అందించారు. 63 రన్స్ వద్ద మూడో వికెట్ పడగా.. షాహిదీ - ఒమర్జాయ్ కలిసి 184 రన్స్ వరకు తీసుకెళ్లారు. 184 రన్స్ వద్ద ఒమర్జాయ్ ఔట్ అవ్వగా.. ఆ తర్వాత కాసేపటికే షాహిదీ పెవిలియన్ చేరాడు.
భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా 4వికెట్లు తీయగా.. పాండ్యా 2 వికెట్లు తీశాడు. అశ్విన్ స్థానంలో జట్టులోకి వచ్చిన శార్దుల్ 6 ఓవర్లు వేసి 31 రన్స్ ఇచ్చి వికెట్లు ఏమి తీయలేదు. కాగా చిన్న జట్టైన ఆఫ్ఘాన్ భారీ స్కోర్ చేయడంతో భారత అభిమానులు అవాక్కయ్యారు. ఒకవేళ రషీద్ ఖాన్ తన బంతితో ఏమైన మాయ చేస్తే ఇండియా ఛేజింగ్ అంత సింపుల్గా ఉండదు.తొలి మ్యాచ్లో ఆస్ట్రేలియాను చిత్తు చేసిన ఇండియా.. రెండో మ్యాచ్ లోనూ గెలవాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు బంగ్లాదేశ్ చేతుల్లో ఓడి ఒత్తిడిలో ఆఫ్ఘనిస్థాన్ సైతం.. ఈ మ్యాచ్ విజయంపై కన్నేసింది.