Home > క్రీడలు > Asia cup 2023: థ్రిల్లింగ్ మ్యాచ్.. పాపం ఆఫ్ఘనిస్తాన్

Asia cup 2023: థ్రిల్లింగ్ మ్యాచ్.. పాపం ఆఫ్ఘనిస్తాన్

Asia cup 2023: థ్రిల్లింగ్ మ్యాచ్.. పాపం ఆఫ్ఘనిస్తాన్
X

ఆసియా కప్ లో అసలు సిసలైన మజా వచ్చింది. చివరి ఓవర్ వరకు ఉత్కంఠ నెలకొంది. అమీతుమీ అంటూ ఇరు జట్లు పోటా పోటీగా ఆడాయి. మ్యాచ్ చూస్తున్న ప్రేక్షకుల్లో.. చాలా కాలం తర్వాత వన్డేల్లో ఇలాంటి థ్రిల్లర్ మ్యాచ్ ను చూస్తున్నాం అనే ఫీల్ వచ్చింది. ఫలితం.. రెండు పరుగుల తేడాతో ఓ జట్టు ఓడిపోయి ఇంటికి పోగా.. మరో జట్టు సూపర్ 4లోకి అడుగు పెట్టింది. లాహోర్ లో జరిగిన మ్యాచ్ లో శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ జట్లు పోటీ పోటీగా ఆడాయి. మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లకు 8 వికెట్ల నష్టానికి 291 పరుగులు చేసింది. టాపార్డర్ పతుమ్ నిసంక (41, 40 బంతుల్లో), కరుణరత్నె (32, 35 బంతుల్లో), కుశాల్ మెండీస్ (92, 84 బంతుల్లో) రాణించారు. చివర్లో అసలంక (36, 43 బంతుల్లో), దునిత్ వెల్లలంగె (33, 39 బంతుల్లో), తీక్షణ (28, 24 బంతుల్లో) ఆఫ్ఘన్ బౌలర్లను ఓ ఆట ఆడుకున్నారు. దీంతో లంక భారీ స్కోర్ చేయగలిగింది. ఆఫ్ఘాన్ బౌలర్లలో గుల్బదిన్ నాలుగు వికెట్లు తీసుకోగా, రషిద్ రెండు, ముజీబ్ ఒక వికెట్ పడగొట్టారు.

పోరాడి ఓడింది:

292 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్ఘాన్ కు ఆరంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఓపెనర్లు గుర్బాజ్ (4), ఇబ్రహిమ్ జద్రాన్ (7) తక్కువ పరుగులకే వెనుదిరిగారు. నయిబ్ (22, 16 బంతుల్లో) పరవాలేదనిపించాడు. తర్వాత వచ్చిన మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు లంక బౌలర్లను చితక్కొట్టారు. రహ్మత్ షా (45, 40 బంతుల్లో), హష్మానుల్లా (59, 66 బంతుల్లో), నబి (65, 32 బంతుల్లో) మ్యాచ్ ను పూర్తిగా లంక బౌలర్ల నుంచి లాగేసుకున్నారు. చివర్లో వీళ్ల వికెట్లు పడే సరికి ఆఫ్ఘాన్ మళ్లీ కష్టాల్లో పడింది. రషిద్ ఖాన్ (27, 16 బంతుల్లో), కరీం (22, 13 బంతుల్లో), జద్రాన్ (23, 15 బంతుల్లో) పోరాడినా ఫలితం దక్కలేదు. వీళ్లు త్వరగా త్వరగా క్రీజ్ నుంచి పెవిలియన్ చేరడంతో ఆఫ్ఘాన్ ఆశలు ఆవిరయ్యాయి. దీంతో ఆఫ్ఘాన్ 2 పరుగుల తేడాతో ఓడిపోయింది. లంక బౌలర్లలో రజిత 4, దునిత్, డి సిల్వ 2, పతిరాణా, తీక్షణ ఒక్కో వికెట్ పడగొట్టారు.





Updated : 5 Sep 2023 5:36 PM GMT
Tags:    
Next Story
Share it
Top