Home > క్రీడలు > ENG vs AFG :ఇంగ్లాండ్కు చుక్కలు చూపిస్తూ.. ఆఫ్ఘన్ అద్భుత పోరాటం

ENG vs AFG :ఇంగ్లాండ్కు చుక్కలు చూపిస్తూ.. ఆఫ్ఘన్ అద్భుత పోరాటం

ENG vs AFG :ఇంగ్లాండ్కు చుక్కలు చూపిస్తూ.. ఆఫ్ఘన్ అద్భుత పోరాటం
X

ఢిల్లీ వేదికపై ఆఫ్ఘనిస్తాన్ తో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బౌలింగ్ ఎంచుకుంది. అనంతరం మాట్లాడిన ఇంగ్లాండ్ కెప్టెన్ జాస్ బట్లర్.. ఆఫ్ఘన్ ను తక్కువ చేస్తూ.. ఈ మ్యాచ్ లో తమ జట్టే గెలుస్తుందని చెప్పుకొచ్చాడు. ఆ మాటలను ఆఫ్ఘన్ సీరియస్ గా తీసుకుందో ఏమో కానీ.. ఇంగ్లాండ్ బౌలర్లకు చుక్కలు చూపించారు. ప్రపంచ మేటి జట్టు, గొప్ప బౌలర్లను అని ఏ మాత్రం భయం లేకుండా.. అద్భుత పోరాటం చేశారు. దీంతో 49.5 ఓవర్లలో ఆఫ్ఘన్ 284 పరుగులు చేసింది. ఓపెనర్లు గుర్బాజ్ (80, 57 బంతుల్లో, 4 సిక్సర్లు, 8 ఫోర్లు) ఇంగ్లాండ్ పనిపట్టాడు. ఇబ్రహిమ్ (28) సహకారంతో శుభారంభాన్ని అందించాడు.

అయితే ఆఫ్ఘన్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు దాన్ని కొనసాగించలేకపోయారు. రహ్మత్ (3), షహిది (14), అజ్మతుల్లా (19) విఫలం అయ్యారు. లోయర్ ఆర్డర్ బ్యాటర్లు ఇక్రమ్ అలిఖిల్ (58, 66 బంతుల్లో, 3 ఫోర్లు, 2 సిక్సర్లు) విరుచుకుపడ్డాడు. రషిద్ ఖాన్ (23), ముజీబ్ (28) అదే జోరును కొనసాగించారు. దీంతో ఆఫ్ఘన్ భారీ స్కోర్ చేసింది. ప్రపంచంలోనే మేటి బౌలర్లుగా పరిగణించే.. క్రిస్‌ వోక్స్‌ (4-0-41-0), మార్క్‌ వుడ్‌ (9-0-50-2), సామ్‌ కర్రన్‌ (4-0-46), రీస్‌ టాప్లే (8.5-1-52)లను ఆఫ్ఘన్‌ బ్యాటర్లు ఉతికి ఆరేశారు. స్పిన్నర్లు పరవాలేదనిపించారు. అడిల్ రషిద్ 3 వికెట్లు తీసుకోగా.. పార్ట్ టైం బౌలర్లు రూట్, లివింగ్ స్టోన్ చెరో వికెట్ పడగొట్టారు. మార్క్ వుడ్ 2 వికెట్లు తీసుకున్నాడు. ఈ మ్యాచ్ లో భారీ స్కోర్ (284) చేసిన ఆఫ్ఘన్ కు.. వరల్డ్ కప్ లో ఇది రెండో అత్యధిక స్కోరు. 2019 వరల్డ్ కప్ లో వెస్టిండీస్ పై 288 పరుగులు చేశారు. గత మ్యాచ్ లో భారత్ పై 272 పరుగులు సాధించారు. లక్ష్య చేదనంలో ఇంగ్లాండ్ ఒక వికెట్ కోల్పోయింది. ఫరూకి బౌలింగ్ లో బెయిర్ స్ట్రో (2) పెవిలియన్ చేరాడు.

Updated : 15 Oct 2023 6:50 PM IST
Tags:    
Next Story
Share it
Top