Afghanistan vs srilanka : సెమీస్ రేసులో ఆఫ్గనిస్తాన్.. శ్రీలంకపై సంచలన విజయం
X
ఇకపై ఆప్గనిస్తాన్ను పసికూన అని అనకూడదేమో. ఎందుకంటే వరల్డ్ కప్లో ఆ జట్టు ప్రదర్శన అలా ఉంది. పెద్ద జట్లను ఓడగొడుతూ తాము ఎవరికి తక్కువ కాదు అని నిరూపిస్తోంది. తాజాగా మరో సంచలన విజయాన్ని నమోదు చేసింది. శ్రీలంకపై ఆఫ్గనిస్తాన్ 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. పూణే వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో 242 టార్గెట్తో బరిలోకి దిగిన ఆఫ్గాన్.. 45.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది. అజ్మతుల్లా, హష్మతుల్లా షాహిదీ, రహ్మత్ షా హాఫ్ సెంచరీలతో చెలరేగి తమ జట్టుకు అదిరిపోయే గెలుపును అందించారు. ఈ గెలుపుతో ఆఫ్గాన్ పాయింట్స్ టేబుల్లో ఐదో స్థానానికి చేరింది.
అంతుకుముందు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆఫ్గనిస్తాన్ శ్రీలంకను తక్కువ స్కోర్కే కట్టడి చేసింది. 49.3 ఓవర్లలో 241 రన్స్కే శ్రీలంకను కుప్పకూల్చింది. లంక బ్యాటర్లలో పాతుమ్ నిస్సాంక మాత్రమే 46 రన్స్ చేయగా.. మిగితా బ్యాట్స్మెన్స్ 40 లోపే ఔట్ అయ్యారు. కుశాల్ మెండిస్ 39, సదీర సమరవిక్రమ 36 చేయగా.. చివర్లో మహేశ్ తీక్షణ 29 రన్స్ చేయడంతో లంక 241 రన్స్ చేయగలిగింది. ఆప్గాన్ బౌలర్లలో ఫజల్హక్ ఫారూఖీ 4 వికెట్లు తీయగా.. ముజీబ్ 2, అజ్మతుల్లా, రషీద్ ఖాన్ ఒక్కో వికెట్ పడగొట్టారు.