IND vs AFG : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆఫ్ఘానిస్తాన్
X
వరల్డ్ కప్ 2023లో భాగంగా ఇవాళ ఆఫ్ఘనిస్తాన్తో భారత్ తలపడుతోంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది. ఆఫ్ఘనిస్తాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ మొదట బౌలింగ్ చేయనుంది. ఈ మ్యాచ్లో అశ్విన్ స్థానంలో శార్దుల్ ఠాకూర్ జట్టులోకి వచ్చాడు. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండడంతో పరుగుల వరద పారే అవకాశముంది.
తొలి మ్యాచ్లో ఆస్ట్రేలియాను చిత్తు చేసిన ఇండియా.. రెండో మ్యాచ్ లోనూ గెలవాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు బంగ్లాదేశ్ చేతుల్లో ఓడిన ఒత్తిడిలో ఉన్న ఆఫ్ఘనిస్థాన్ సైతం మ్యాచ్ విజయంపై కన్నేసింది.
భారత జట్టు : రోహిత్ శర్మ (సి), ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (డబ్ల్యు), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్
ఆఫ్ఘాన్ : రహ్మానుల్లా గుర్బాజ్(w), ఇబ్రహీం జద్రాన్, రహమత్ షా, హష్మతుల్లా షాహిదీ(c), నజీబుల్లా జద్రాన్, మొహమ్మద్ నబీ, అజ్మతుల్లా ఒమర్జాయ్, రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రహ్మాన్, నవీన్-ఉల్-హక్, ఫజల్హక్ ఫరూఖీ