Home > క్రీడలు > టీమిండియా టెస్ట్ కెప్టెన్‎గా రహానే..?

టీమిండియా టెస్ట్ కెప్టెన్‎గా రహానే..?

టీమిండియా టెస్ట్ కెప్టెన్‎గా రహానే..?
X

WTC ఫైనల్‌లో ఓటమి కొత్త చర్చకు తెరలేపింది. సీనియర్ ఆటగాళ్ల ప్రదర్శన..రోహిత్ శర్మ కెప్టెన్సీపై జోరుగా చర్చ నడుస్తోంది. రోహిత్ శర్మను కెప్టెన్ నుంచి తప్పించాలనే డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. వ్యక్తిగత ప్రదర్శనతో పాటు..కెప్టెన్సీలోనూ విఫలం కావడంతో రోహిత్‌‌ను తప్పించి మరో ఆటగాడికి సారథ్యబాధ్యతలు అప్పగించాలనే వాదనలు వినిపిస్తున్నారు.

ఇది ఇలా ఉంటే వచ్చే నెల వెస్టిండీస్ టూర్‌కు భారత్ సిద్ధమవుతోంది. జూలై నెలలో భారత జట్టు వెస్టిండీస్‌లో పర్యటించనుంది. ఈ టూర్‌లో భాగంగా టీమిండియా రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది. అయితే వెస్టిండీస్ పర్యటనకు భారత్ ప్రధాన ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్, పుజారాలాంటి ఆటగాళ్లను టెస్టు సిరీస్‌కు తీసుకోకూడదని పరిగణలోకి బీసీసీఐ భావిస్తోంది. వారి స్థానాల్లో యువఆటగాళ్లను ఎంపిక చేసే అవకాశం ఉంది.

అదే జరిగితే విండీస్‌తో టెస్టు సిరీస్‌కు కెప్టెన్‌గా రహానేను నియమించాలని బీసీసీఐ ఆలోచన చేస్తోంది. ఐపీఎల్‌లో రాణించి డబ్ల్యూటీసీ ఫైనల్ ద్వారా టెస్టుల్లోకి అడుగుపెట్టిన రహానే.. ఆసీస్‌పై 89, 46 చొప్పున పరుగులతో రాణించాడు. 2021-22లో రహానే సారథ్యంలో ఆస్ట్రేలియాపై భారత్ జట్టు టెస్ట్ సిరీస్ ను గెలిచింది. ఈ నేపథ్యంలో రహానే భారత జట్టును ముందుకు నడిపే అవకాశం ఉంది. వెస్టిండీస్‌తో టెస్ట్ సిరీస్‌కు భారత ప్రధాన బౌలర్లు మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్‌లకు కూడా విశ్రాంతినిచ్చే అవకాశం ఉంది.

Updated : 16 Jun 2023 2:32 PM GMT
Tags:    
Next Story
Share it
Top