Home > క్రీడలు > నేను ఏ పార్టీలో చేరడం లేదు : అంబటి రాయుడు

నేను ఏ పార్టీలో చేరడం లేదు : అంబటి రాయుడు

నేను ఏ పార్టీలో చేరడం లేదు : అంబటి రాయుడు
X

గుంటూరు జిల్లాలో భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు విస్తృత పర్యటన కొనసాగుతోంది. క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన తర్వాత రాయుడు ప్రజా సమస్యలను అధ్యయం చేసేందుకు ప్రతి పల్లె, పట్టణా బాట పట్టారు. రైతులు, విద్యార్థులు, నిరుపేదల సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. పొలిటికల్ ఎంట్రీ వార్తల నేపథ్యంలో రాయుడు పర్యటన చర్చనీయాంశమైంది. అయితే ఇప్పటి వరకు అతడు రాజకీయ రంగప్రవేశం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడడం, ఇటీవల సీఎం జగన్‌ను కలవడంతో ఆయన వైసీపీలోకి వెళ్తారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో మరొకసారి తన రాజకీయ అరంగేట్రంపై రాయుడు స్పందించాడు.

తాను ఇంకా ఏ పార్టీలో చేరలేదని స్పష్టం చేశాడు. ఎక్కడి నుంచి పోటీ చేయడం లేదని కూడా వెల్లడించాడు. ప్రస్తుతం అకాడమీలు ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిపాడు. రాష్ట్రంలో క్రికెట్‌ అభివృద్ధికి చర్యలు తీసుకుంటానని..ఐపీఎల్‌ జట్టు కోసం కృషి చేస్తానని వెల్లడించారు. నేడు మంగళగిరిలో అక్షయపాత్ర ఫౌండేషన్‌ను సందర్శించిన సందర్భంలో మీడియాతో మాట్లాడాడు. అక్షయ పాత్ర ద్వారా పిల్లలకు ఆహారం అందించేందుకు తన వంతు కృషి చేస్తానని అన్నారు.


Updated : 16 July 2023 7:26 PM IST
Tags:    
Next Story
Share it
Top