రాయుడు రీ ఎంట్రీ..మరోసారి బ్యాట్ పట్టేందుకు సిద్ధం
X
ఆటకు వీడ్కోలు పలికి ప్రజాసేవకు సిద్ధమైన భారత జట్టు మాజీ క్రికెటర్ అంబటి రాయుడు మరోసారి బ్యాట్ పట్టనున్నాడు. కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆడాలని రాయుడు నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు సెయింట్ కిట్స్, నెవిస్ పేట్రియాట్స్..రాయుడుతో ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆడుతున్న భారత్ రెండో క్రికెటర్గా రికార్డు నెలకొల్పాడు. రాయుడు కంటే ప్రవీణ్ తాంబే ఈ లీగ్‌లో ఆడాడు.CPL 2023కి అందుబాటులో లేని దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ ట్రిస్టన్ స్టబ్స్ స్థానాన్ని పేట్రియాట్స్‌లో రాయుడు భర్తీ చేయనున్నాడు.
37 ఏళ్ల రాయుడు, ఈ ఏడాది మేలో చెన్నై సూపర్ కింగ్స్ ఐదో ఐపీఎల్ టైటిల్‌ను సాధించిన తర్వాత ఆటకు గుడ్ బై చెప్పేశాడు. తర్వాత USAలో ప్రారంభమైన మేజర్ లీగ్ లో ఆడాలని రాయుడు భావించాడు. కానీ బీసీసీఐ నిబంధనలు ప్రకారం వీలు పడలేదు.కూలింగ్ ఆఫ్ పీరియడ్ రూల్ ప్రకారం ఇటీవల కాలంలో రిటైర్డ్ అయిన భారత్ క్రికెటర్లు విదేశి లీగ్ లో ఆడకూడదనే రూల్ ఉంది. దీంతో సీసీఎల్ లో కూడా ఆడేందుకు రాయుడుకి ఆటంకం కలిగే అవకాశాలు ఉన్నాయి.