Asian Para Games 2023 SheetalDevi : శీతల్ దేవి ప్రతిభకు ఆనంద్ మహీంద్ర ఫిదా..
X
ఆసియా పారా గేమ్స్లో ఆర్చర్ శీతల్ దేవి అదరగొట్టింది. చేతులు లేకున్నా కాళ్లతోనే ఆర్చరీలో ఒకే ఎడిషన్లో రెండు స్వర్ణాలు సాధించి సత్తా చాటింది. తన ప్రతిభకు ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర సైతం ఫిదా అయ్యారు. ఆమెకు నచ్చిన కారు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు.
‘‘జీవితంలో ఇంకెప్పుడూ చిన్న సమస్యల గురించి ఆలోచించను. శీతల్‌దేవీ.. నువ్వు మా అందరికీ స్ఫూర్తి. నీ నుంచి మేం ఎంతో నేర్చుకోవాలి. మా కంపెనీ కార్లలో నీకు నచ్చిన దానిని ఎంచుకోండి. దాన్ని నువ్వు నడిపేందుకు వీలుగా తయారు చేసిస్తాం’’ అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కు ఆమె సాధన చేస్తున్న వీడియోను షేర్ చేశారు. ఇక ఈ ట్వీట్‌కు యూజర్ల నుంచి విశేష స్పందన వచ్చింది. ఎంతోమంది శీతల్ ప్రతిభను కొనియాడుతున్నారు.
I will never,EVER again complain about petty problems in my life. #SheetalDevi you are a teacher to us all. Please pick any car from our range & we will award it to you & customise it for your use. pic.twitter.com/JU6DOR5iqs
— anand mahindra (@anandmahindra) October 28, 2023