Home > క్రీడలు > Angelo Mathews Controversy : క్రికెట్ చరిత్రలో తొలిసారి..

Angelo Mathews Controversy : క్రికెట్ చరిత్రలో తొలిసారి..

Angelo Mathews Controversy : క్రికెట్ చరిత్రలో తొలిసారి..
X

వన్డే వరల్డ్ కప్ లో శ్రీలంక, బంగ్లాదేశ్ మ్యాచ్ లో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. శ్రీలంక బ్యాట్స్ మెన్ మాథ్యూస్ క్రీజులో అడుగుపెట్టకముందే ఔటయ్యాడు. అతడు సమయానికి క్రీజులోకి చేరుకోకపోవడంతో అంపైర్లు ఔట్‌గా ప్రకటించారు. దీంతో అరుణ్ జైట్లీ స్టేడియంలో హైడ్రామా చోటుచేసుకుంది. ఒక బ్యాటర్ ఇలా ఔటవ్వడం క్రికెట్ చరిత్రలో ఇదే మొదటిసారి.

శ్రీలంక ఇన్నింగ్స్ 25వ ఓవర్ రెండో బాల్కు సమర విక్రమ ఔటయ్యాడు. అతని స్థానంలో క్రీజులోకి రావాల్సిన మాథ్యూస్ సరైన సమయానికి గ్రౌండ్ లో అడుగుపెట్టాడు. హెల్మెట్‌ సమస్య వల్ల మరొకటి కావాలని డ్రెస్సింగ్ రూమ్ వైపు సైగలు చేశాడు. వెంటనే కరుణరత్నే పరిగెత్తుకుంటూ వచ్చి అతనికి హెల్మెట్‌ అందించాడు. అయితే ఇదంతా జరగడానికి మూడు నిమిషాలకుపైగా సమయం పట్టింది. నిబంధనల మేరకు బంగ్లా ఫీల్డర్లు అప్పీల్ చేయడంతో అంపైర్ ఔట్‌గా ప్రకటించాడు. శ్రీలంక బ్యాటర్ మాథ్యూస్ వాదనను అంపైర్లు పట్టించుకోకపోవడంతో ఆ నిర్ణయం వివాదాస్పదంగా మారింది.




Updated : 6 Nov 2023 5:26 PM IST
Tags:    
Next Story
Share it
Top