Home > క్రీడలు > india vs England : టీమిండియాకు షాక్...రెండో టెస్ట్ కు దూరంకానున్న ఆల్ రౌండర్?

india vs England : టీమిండియాకు షాక్...రెండో టెస్ట్ కు దూరంకానున్న ఆల్ రౌండర్?

india vs England : టీమిండియాకు షాక్...రెండో టెస్ట్ కు దూరంకానున్న ఆల్ రౌండర్?
X

ఇంగ్లాండ్ తో జరగబోయే రెండో టెస్ట్ కు ముందు భారత్ కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఉప్పల్ తొలి టెస్ట్ లో తొడ కండరాలు పట్టేయడంతో టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా రెండో మ్యాచ్‌కు దూరంగా కానున్నట్లు తెలుస్తోంది. రెండో ఇన్నింగ్స్‌లో రన్ చేస్తుండగా జడేజా తొడ కండరాలు పట్టేయడంతో అతను రనౌట్‌ అయ్యాడు. అంతేగాక, రెండో టెస్ట్‌ ఆడతాడో లేదో ఇంకా స్పష్టత రాలేదు.

జడేజాను బెంగళూరులోని నేషనల్‌ క్రికెట్‌ అకాడమీకి తరలించాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. నిన్న మ్యాచ్‌ అనంతరం​ హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ దీనిపై స్పందిస్తూ..ఇంకా ఫిజియోను సంప్రదించలేదని..ఇప్పుడే అతడి ఆరోగ్య పరిస్థితి గురించి ఏమీ చెప్పలేమని చెప్పాడు.

అటు విశాఖ వేదికగా రెండో టెస్ట్‌ ఫిబ్రవరి 2 నుంచి ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌ కోసం టీమిండియా విశాఖకు వెళ్లింది. కాగా, హైదరాబాద్‌ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్‌ 23 పరుగుల తేడాతో టీమిండియాపై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యాన్ని ప్రదర్శించినప్పటికీ ఓటమిపాలైంది. జడేజా తొలి ఇన్నింగ్స్‌లో 87 పరుగులు చేసి సత్తా చాటాడు. అంతేగాక అటు బౌలింగ్‌లోనూ జడ్డూ రాణించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 3, రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్లు పడగొట్టాడు. బ్యాటింగ్‌ సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో 2 పరుగుల వద్ద తొడ కండరాలు పట్టేయడంతో జడ్డూ రనౌటయ్యాడు. ఇంగ్లాండ్‌ స్పిన్‌కు పేక మేడలా కూలిపోయిన రోహిత్‌ సేన.. ఉప్పల్‌లో టెస్టుల్లో అజేయ రికార్డును చేజేతులా కోల్పోయింది.




Updated : 29 Jan 2024 12:26 PM IST
Tags:    
Next Story
Share it
Top