మరోసారి తండ్రి కాబోతున్న కోహ్లీ.. అనుష్క వీడియో వైరల్..
X
విరాట్ కోహ్లీ మళ్లీ తండ్రి కాబోతున్నాడనే ప్రచారం ఊపందుకుంది. అనుష్క శర్మ గర్భం దాల్చిందన్న పుకార్లు శికారు చేస్తున్నాయి. గతంలోనూ ఇలాంటి వార్తలు వచ్చినా.. విరుష్క జంట మాత్రం వాటిపై స్పందించలేదు. అయిన నెటిజన్లు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. అనుష్క ప్రెగ్నెంట్ అంటూ ఓ వీడియోను హైలెట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది.
బెంగళూరులోని ఓ హోటల్లో విరుష్క జంట నడుచుకుంటూ వెళ్లే వీడియోను ఓ నెటిజన్ షేర్ చేశాడు. ఇందులో అనుష్క బేబీ బంప్తో ఉందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. దీంతో ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది. అనుష్క శర్మ రెండోసారి ప్రెగ్నెంట్ అయ్యిందంటూ కాంగ్రాట్స్ చెబుతున్నారు. మరికొందరు బుల్లి కోహ్లీ రాబోతున్నాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా 2017లో కోహ్లీ- అనుష్కల పెళ్లి అవ్వగా.. 2021లో వారికి ఓ పాప జన్మించింది.
Virushka in Bangalore 🧿💘 pic.twitter.com/feLpF35i09
— Alaska • WC Era🏏 (@alaskawhines) November 9, 2023