అందుకే విరాట్ పేరు రాహుల్గా మార్చాం: అనుష్క శర్మ
X
ఇండస్ట్రీలో అయినా.. స్పోర్ట్ సెలబ్రెటీల్లో అయినా.. మోస్ట్ ఫేవరెట్ కపుల్ ఎవరంటే టక్కున చెప్పే పేరు విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ. 2013లో షాంపూ యాడ్ ద్వారా పరిచయమైన వీళ్లిద్దరు కొంతకాలం ప్రేమలో మునిగిపోయి.. తర్వాత 2017లో పెళ్లి చేసుకున్నారు. ఎలాంటి హడావిడి లేకుండా.. ఇటలీలో రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. సెలబ్రెటీలైనా వీరిద్దరు పబ్లిసిటీకి దూరంగా ఉంటారు. అందుకే కేవలం 42 మంది సన్నిహితులు, మిత్రుల సమక్షంలో వీరు వివాహం చేసుకున్నారు. తమ బిడ్డ వామికను కూడా మీడియాకు దూరంగా ఉంచుతారు. అయితే విరుష్కల పెళ్లి సీక్రెట్ గా జరిపేందుకు నానా తంటాలు పడ్డారట. వీరిద్దరి పెళ్లి జరిగే సమయానికి విరాట్ కోహ్లీ టీమిండియా కెప్టెన్. అనుష్క శర్మ పేరు పొందిన నటి. అయితే తమ పెళ్లి మాత్రం నిరాడంబరంగా.. హోమ్ స్టైల్ వెడ్డింగ్ చేసుకోవాలని భావించారు.
సెలబ్రెటీల పెళ్లిలా కాకుండా.. కేవలం అనుష్క, విరాట్ కోహ్లీ పెళ్లిలా చేరుకోవాలని భావించారట. అందుకే విరాట్ కోహ్లీ పేరును మార్చినట్లు అనుష్క తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ‘మా పెళ్లిని సీక్రెట్ గా పవిత్రత, శాంతిలో కూడిన వాతావరణంలో జరుపుకుందామనుకున్నాం. విరాట్ ఇంటర్నేషనల్ సెలబ్రెటీ. అయితే.. అక్కడ జరుగుతుంది విరాట్ పెళ్లి అని తెలిస్తే.. మీడియా, ఫ్యాన్స్ అంతా చేరి రచ్చ రచ్చ చేస్తారు. అందుకే హోటల్ కేటరర్ విషయంలో విరాట్ పేరును రాహుల్ గా మార్చా’మని అనుష్క చెప్పుకొచ్చింది.