మైదానంలోకి దూసుకొచ్చి అభిమాన ఆటగాడికి ‘హగ్’...కట్ చేస్తే
X
ఫుట్‌బాల్, క్రికెట్ మ్యాచ్‌లు సీరియస్ గా జరుగుతున్న సమయంలో కొంతమంది ప్రేక్షకులు సెక్యూరిటీని దాటుకుని మైదానంలోకి వచ్చేస్తుంటారు. తమ అభిమాన ఆటగాడికి హేక్ హ్యాండ్ ఇవ్వడం, వారి కాలుకు మొక్కడం, హగ్ చేసుకోవడం వంటివి చేస్తారు. అలా వచ్చిన వారిని సెక్యూరిటీ వచ్చితీసుకెళ్లడం చూస్తుంటాం. ఇలాంటి సీన్ తాజాగా ఓ ఫుట్ బాల్ మ్యాచ్‌లో జరిగింది. అయితే ఆ అభిమాని భద్రతా సిబ్బందికి మాత్రం చుక్కలు చూపెట్టాడు.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఫుట్‌బాల్ దిగ్గజం లియోన్ మెస్సీ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. అతడు మైదానంలోకి దిగితే మెస్సీ..మెస్సీ అంటూ అభిమానుల నినాదాలతో స్టేడియం మార్మోగిపోవాల్సిందే. తాజాగా అర్జెంటీనా, ఆస్ట్రేలియా జట్ల మధ్య గురువారం రాత్రి బీజింగ్ స్టేడియంలో జరిగిన ఫ్రెండ్లీ మ్యాచ్ జరింది. ఈ మ్యాచ్ కు అభిమానులు భారీగా తరలివచ్చారు.
అయితే మ్యాచ్ 61వ నిమిషంలో మెస్సీ కార్నర్ వద్ద ఉన్నాడు. ఆ సమయంలో ఓ అభిమాని సెక్యూరిటీ దాటుకుంటూ మెస్సీ వద్దకు చేరుకున్నాడు. పరుగెత్తుకొచ్చి మెస్సీని కౌగిలించుకున్నాడు. ఆ తర్వాత ఆనందంతో గ్రౌండ్ మొత్తం పరుగులు తీశాడు. అతడిని పట్టుకునేందుకు సెక్యూరిటీ సిబ్బంది ప్రయత్నించినా వారికి దొరక్కండా ముప్పుతిప్పలు పెట్టాడు. చివరికి అతడిని పట్టుకొని బయటకు లాక్కెళ్లారు.ప్రస్తుతం ఆ వీడియో ఆన్‌లైన్‌లో వైరల్ అవుతోంది.
ఈ మ్యాచ్‌లో అర్జెంటీనా 2-0తో ఆస్ట్రేలియాపై గెలుపొందింది. మెస్సీ ఆట ఆరంభమైన రెండో నిమిషంలోనే మెరుపు గోల్ కొట్టి అభిమానులను అలరించాడు.