Home > క్రీడలు > జైషావల్లే శ్రీలంక క్రికెట్ నాశనం అయింది

జైషావల్లే శ్రీలంక క్రికెట్ నాశనం అయింది

జైషావల్లే శ్రీలంక క్రికెట్ నాశనం అయింది
X

బీసీసీఐ సెక్రెటరీ జై షా వల్లే శ్రీలంక క్రికెట్ బోర్డ్ నాశనం అయిందని సంచలన ఆరోపణలు చేశారు ఆ దేశ మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ. శ్రీలంక బోర్డును నిర్వహిస్తున్నదీ, నాశనం చేస్తున్నదీ జై షాయేనని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాజాగా రాజకీయ జోక్యం పెరిగిపోయిందంటూ శ్రీలంక క్రికెట్‌ బోర్డును ఐసీసీ సస్పెండ్ చేసిన నేపథ్యంలో రణతుంగ వ్యాఖ్యలు చేశారు. లంక బోర్డ్ అధికారులు, జైషాకు మధ్యున్న సత్సంబంధాలతో తమ బోర్డును తొక్కిపట్టి, నియంత్రించొచ్చని అనుకున్నారు. కొంతకాలంగా జైషా లంక క్రికెట్ వ్యావహారాలను నడింపించాడు. అతని ఒత్తిడి కారణంగా బోర్డు నాశనం అయిందని తీవ్రంగా విమర్శించాడు.

శ్రీలంక క్రికెట్ బోర్డులో జరుగుతున్న ఆధిపత్య పోరులో రణతుంగ కీలకంగా మారాడు. శ్రీలంక స్పోర్ట్స్ మినిస్టర్ రోషన్ రణసింఘే బోర్డ్ ను రద్దు చేసి.. దాని స్థానంలో మధ్యంతర కమిటీని ఏర్పాటుచేశారు. ఈ క్రమంలో బోర్డులో అమినీతి పెరగడం వల్లే బోర్డును రద్దు చేయాల్సి వచ్చిందని స్పోర్ట్స్ మినిస్టర్ చెప్పాడు. కాగా ఈ నిర్ణయాన్ని సవాలు చేసిన ప్రస్తుతం బోర్డ్ అధ్యక్షుడు షమ్మీ సిల్వా శ్రీలంక కోర్టును ఆశ్రయించాడు. ఈ విషయంలో దర్యాప్తు పూర్తయ్యే వరకు బోర్డును రద్దు పునరుద్దరిస్తూ కోర్ట్ తీర్పు ఇచ్చింది. దీంతో ఐసీసీ శ్రీలంక బోర్డును సస్పెండ్ చేసింది.

Updated : 14 Nov 2023 4:39 AM GMT
Tags:    
Next Story
Share it
Top