రికార్డ్ లకు ఎక్కిన భారత్ పేసర్
X
ఐర్లాండ్ మ్యాచ్ లలో టీమ్ ఇండియా మెంబర్లు రికార్డులు సాధిస్తున్నారు. తాజాగా భారత్ ఫాస్ట్ బౌలర్ అర్షదీప్ సింగ్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. టీ20ల్లో అత్యంత వేగంగా 50 వికెట్లు తీసిన ప్లేయర్ గా రికార్డ్ ను తన పేరిట నమోదు చేసుకున్నాడు. 33 టీ20 మ్యాచ్ లలో 50 వికెట్లు తీశాడు అర్షదీప్.
అర్షదీప్ కన్నా ముందు ఈ రికార్డ్ బుమ్రా పేరున ఉండేది. బుమ్రా 41 మ్యాచ్లలో 50 వికెట్లు తీశాడు. కానీ ఇప్పుడు అర్షదీప్ బుమ్రా కంటే వేంగా 50 వికెట్లు తీసి ఒక కొత్త రికార్డ్ ను సృష్టించాడు. అయితే వీళ్ళిద్దరి కన్నా ముందు స్పిన్నర్ కులదీప్ యాదవ్ 30 మ్యాచ్ లలోనే 50 వికెట్లు తీసాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే అందరూ అనుకున్నట్టుగానే ఐర్లాండ్ మీద భారత్ రెండవ మ్యాచ్ లోనూ విజయం సాధించి సీరీస్ ను సొంతం చేసుకుంది. ఇంకా ఒక మ్యాచ్ జరగాల్సి ఉండగానే సీరీస్ ను కైవసం చేసుకుంది. సీనియర్లు లేని యువ జట్టు ఆల్ రౌండ్ షో తో అందరి హృదయాలను కొల్లగొట్టారు. ఈ సీరీస్ లో లాస్ట్ మూడవ మ్యాచ్ ఈ నెల 23న జరగనుంది. ఇది కేవలం లాంఛనప్రాయం మాత్రమే.