Home > క్రీడలు > విజృంభించిన భారత బౌలర్లు.. సౌతాఫ్రికా 7 వికెట్లు డౌన్

విజృంభించిన భారత బౌలర్లు.. సౌతాఫ్రికా 7 వికెట్లు డౌన్

విజృంభించిన భారత బౌలర్లు.. సౌతాఫ్రికా 7 వికెట్లు డౌన్
X

సౌతాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్ ను సమం చేసిన టీమిండియా.. వన్డే సిరీస్ ను ఘనంగా ఆరంభించింది. జొహానెస్‌బర్గ్‌ వేదికగా జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్‌లో ప్రొటీస్ కు చుక్కలు చూపిస్తుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన సౌతాఫ్రికా.. భారత బౌలర్ల ముందు మోకరిల్లుతోంది. అర్షదీప్ సింగ్ (4), అవేశ్ ఖాన్ (3) విజృంభించారు. దాటిగా ఆరంభిస్తారనుకున్న సౌతాఫ్రికా ఓపెనర్లను అర్షదీప్ బోల్తా కొట్టించాడు. రీజా హెండ్రిక్స్ డకౌట్ కాగా, టోనీ డి జోర్జి 28 పరుగులు మాత్రమే చేయగలిగాడు. తర్వాత వాండర్ డసెన్ ను కూడా డకౌట్ చేసిన అర్షదీప్ భారత్ కు మూడు కీలక వికెట్లు అందించాడు.

అర్షదీప్ జోరుకు అవేశ్ ఖాన్ తోడవడంతో.. సౌతాఫ్రికా ఏ దశలోనూ కుదురుకోలేకపోయింది. 58 పరుగులకే 7 కీలక వికెట్లు కోల్పోయిన ప్రొటీస్ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ తర్వాత కెప్టెన్ మార్క్రమ్ (12), క్లసెన్ (6), డేవిడ్ మిల్లర్ (2), వియాన్ ముల్దర్ (0) పెవిలియన్ కు క్యూ కట్టారు. ఈ లెక్కన చూస్తుంటే.. సౌతాఫ్రికా 100 పరుగులు చేయడం కూడా కష్టంగా మారింది. కీలక సమయంలో నామమాత్రపు కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టిన కేఎల్ రాహుల్.. అవకాశాన్ని అందింపుచ్చుకున్నాడు.

Updated : 17 Dec 2023 3:18 PM IST
Tags:    
Next Story
Share it
Top