చెలరేగిన కమిన్స్...ఇంగ్లండ్ ఆలౌట్
Mic Tv Desk | 7 July 2023 8:09 PM IST
X
X
యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో టెస్ట్ కూడా ఆసక్తికరంగా సాగుతోంది.ఇంగ్లండ్ తన మొదటి ఇన్నింగ్స్‌లో 237 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఆసీస్ కెప్టెన్ కమిన్స్ బౌలింగ్ లో నిప్పులు చెరిగాడు. 6 వికెట్లు తీసి ఇంగ్లండ్ పతనాన్ని శాసించాడు. ఆస్ట్రేలియా బౌలింగ్ ధాటికి వరుసగా ఇంగ్లండ్ ఆటగాళ్లు పెవిలియన్‌కు చేరినా..స్టోక్స్ మాత్రం కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. క్రీజ్‌లో నిలబడి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. చివరి వరకు ఒంటరి పోరాటం చేస్తూ 80 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔటయ్యాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో కమిన్స్ 6, స్టార్క్ 2, మిచెల్ మార్ష్, ముర్ఫీ ఒక్కో వికెట్ తీసుకున్నారు. అంతకుముందు ఆస్ట్రేలియా తన మొదటి ఇన్నింగ్స్ లో 263 పరుగులకు ఆలౌట్ అయ్యింది. 26 పరుగుల ఆధిక్యంతో కంగారులు తమ రెండో ఇన్నింగ్స్‌ను మొదలు పెట్టారు.
Updated : 8 July 2023 4:05 PM IST
Tags: Ashes series 2023 England vs Australia 3rd Test Australia bowl out England for 237 26-run first innings lead cummins 6 wickets stokes captian innings
Next Story
© 2017 - 2018 Copyright Mictv news. All Rights reserved.
Designed by Hocalwire