యాషెస్ సిరీస్.. ఇంగ్లండ్, ఆసీస్ దేశ ప్రధానుల మధ్య మాటల యుద్ధం
X
ఇంగ్లండ్ వేదికపై యాషెస్ సిరీస్ జరుగుతోన్న విషయం తెలిసిందే. ఇంగ్లండ్- ఆస్ట్రేలియా మధ్య ఉత్కంఠభరితంగా సాగుతున్న ఈ సిరీస్ లో ఏదో ఒక అంశం వివాదాస్పదం అవుతుంది. ప్రతీ మ్యాచ్ చర్చల్లో నిలుస్తోంది. క్యాచ్ ఔట్లు, రన్ ఔట్లు, ఇరు ప్లేయర్ల మధ్య గొడవలు.. ఇలా ప్రతీ రోజు హోరా హోరీగా కొనసాగుతోంది. ఈ వివాదం ఇరు దేశ ప్రధానుల వరకు పాకింది. ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బానీస్, ఇంగ్లండ్ ప్రధాని రిషీ సునాక్ ‘నాటో’ సమ్మిట్ లో మాటల యుద్ధానికి దిగారు. నాటో సమ్మిట్ లో చర్చించుకున్న ఈ ఇద్దరు ప్రధానులు యాషెస్ పైన కూడా చర్చించారు. ఈ సంభాషణ వీడియోను ఆస్ట్రేలియా ప్రధాని ట్విట్టర్ వేదికపై పోస్ట్ చేశాడు.
భేటీలో ఆసీస్ ప్రధాని ‘మేం ఆధిక్యంలో ఉన్నాం’అని ప్లకార్డ్ లు ప్రదర్శించగా.. రిషి సునాక్ ’మూడో మ్యాచ్ భారీగా గెలిచాం’అని ప్లకార్డ్ చూపించాడు. తర్వాత ఆసీస్ ప్రధాని ‘మేం బెయిస్ట్రోను ఇలా రన్ ఔట్ చేశామ’ని ప్లకార్డ్ చూపిస్తే.. రిషీ ‘అయ్యే.. నేను సాండ్ పేపర్ తీసుకురావడం మర్చిపోయా’అంటూ కౌంటర్ ఇచ్చాడు. ఆ తర్వాత ఇద్దరు షేక్ హ్యండ్ ఇచ్చుకుని వెళ్లిపోయారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనతో నాలుగో టెస్ట్ మరింత ఉత్కంఠంగా సాగేటట్టు కనిపిస్తోంది.
And of course we discussed the #Ashes pic.twitter.com/FeKESkb062
— Anthony Albanese (@AlboMP) July 11, 2023