Yuvraj record Break : యువరాజ్ సింగ్ రికార్డ్ బద్దలు కొట్టిన ఐపీఎల్ ప్లేయర్
X
16 ఏళ్ల క్రితం 2007 టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్.. ఇంగ్లాండ్ పై రికార్డ్ సృష్టించాడు. 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తిచేసుకుని చరిత్రను లిఖించాడు. ఇప్పుడా రికార్డ్ ముస్తాక్ అలీ ట్రోఫీలో బద్దలయింది. రైల్వేస్ టీం మిడిల్ ఆర్డర్ బ్యాటర్ అశుతోష్ శర్మ కేవలం 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి సరికొత్త రికార్డ్ నెలకొల్పాడు. అరుణాచల్ ప్రదేశ్ తో జరిగిన మ్యాచ్ లో చెలరేగిన 25 ఏళ్ల అశుతోష్.. 8 సిక్సర్లు, 1 ఫోర్ తో చెలరేగాడు. 11 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకుని, ఆ తర్వాత బంతికే పెవిలియన్ చేరాడు. మరో క్రమంలో ఉపేంద్ర యాదవ్ (103, 51 బంతుల్లో, 6 ఫోర్లు, 9 సిక్సర్లు) అశుతోష్ తో కలిసి చెలరేగాడు. చివరి ఐదు ఓవర్లలో 115 పరుగులు రాబట్టి 246/5 భారీ స్కోర్ రాబట్టారు. 247 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అరుణాచల్ ప్రదేశ్ 119 పరుగులకే కుప్పకూలింది.