Home > క్రీడలు > Ind vs Eng : భారత బౌలర్ల దెబ్బకు కుప్పకూలిన ఇంగ్లాండ్.. టార్గెట్ ఎంతంటే..?

Ind vs Eng : భారత బౌలర్ల దెబ్బకు కుప్పకూలిన ఇంగ్లాండ్.. టార్గెట్ ఎంతంటే..?

Ind vs Eng : భారత బౌలర్ల దెబ్బకు కుప్పకూలిన ఇంగ్లాండ్.. టార్గెట్ ఎంతంటే..?
X

రాంచీ వేదికగా భారత్ - ఇంగ్లాండ్‌ (IND vs ENG) జట్ల మధ్య జరుగుతోన్న నాలుగో టెస్టులో భారత్ పట్టు బిగించింది. సెకండ్ ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ను 145 రన్స్కే ఆలౌట్ చేసింది. మొత్తంగా ఇంగ్లాండ్ 191 రన్స్ చేసింది. 192 రన్స్ చేస్తే ఈ సిరీస్ భారత్ కైవసం కానుంది. భారత స్పినర్లను ఎదుర్కోవడంలో ఇంగ్లాండ్ బ్యాటర్లు విఫలమయ్యారు. అశ్విన్ 5, కుల్దీప్ యాదవ్ 4 వికెట్లతో ఆ జట్టును కోలుకోలేని దెబ్బకొట్టారు. ముగ్గురు బ్యాటర్లు డగౌట్ అవ్వగా.. మరో ముగ్గురు సింగిల్ డిజిట్కే ఔట్ అయ్యారు. జాక్ క్రాలీ 60, బెయిర్ స్టో (30) పరుగులతో రాణించారు.

అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 307 పరుగులకే అలౌట్ అయింది. వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్(Dhruv Jurel) ఒత్తిడిలోనూ 90 రన్స్తో రాణించాడు.10 ప‌రుగుల తేడాతో సెంచ‌రీ చేజార్చుకున్న‌ప్ప‌టికీ విలువైన ఇన్నింగ్స్‌తో జ‌ట్టును ఒడ్డున‌ప‌డేశాడు. 219 పరుగుల ఓవర్‌నైట్‌ స్కోర్‌తో ఆదివారం ఆటను ప్రారంభించిన టీమిండియా 307 రన్స్ చేసింది. ధ్రువ్‌ జురెల్ (Dhruv Jurel)‌, కుల్‌దీప్‌ యాదవ్‌ (Kuldeep Yadav) కొద్దిసేపు నిలకడగానే ఆడారు. అయితే ఇన్నింగ్స్‌ 88వ ఓవర్‌లో జేమ్స్‌ అండర్సన్‌ వేసిన 3వ బంతికి కుల్‌దీప్‌ (28) ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన ఆకాశ్ దీప్(9) ఎల్‌బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. చివరి వరకూ పోరాడిన ధ్రువ్‌ జురెల్‌( 90) కెరీర్‌లో తొలి సెంచరీ చేసే అవకాశాన్ని తృటిలో చేజార్చుకున్నాడు.

భారత బ్యాటర్లలో జురెల్‌ 90, జైస్వాల్‌ 73, గిల్‌ 38 పరుగులు చేశారు. రాజ్‌కోట్ టెస్టులో సెంచ‌రీ బాదిన‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (2), రజత్‌ పాటిదార్‌ (17), రవీంద్ర జడేజా (12), సర్ఫరాజ్‌ ఖాన్‌ (14), రవిచంద్రన అశ్విన్‌ (1) విఫలమయ్యారు. ఒకద‌శ‌లో ఆలౌట్ ప్ర‌మాదంలో ప‌డిన జ‌ట్టును జురెల్ అద్భుత ఇన్నింగ్స్‌తో ఆదుకున్నాడు. ఇంగ్లాండ్‌ బౌలర్లలో బషీర్‌ 5, హార్ట్‌లీ 3, అండర్సన్‌ 2 వికెట్లు పడగొట్టి.. 46 పరుగులు ఆధిక్యంలో నిలిచింది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ 353 పరుగులకు ఆలౌట్‌ అయింది.

Updated : 25 Feb 2024 4:25 PM IST
Tags:    
author-thhumb

Krishna

సట్టి కృష్ణ.. Mic Tv websiteలో సబ్ ఎడిటర్గా పని చేస్తున్నారు. ఈయనకు జర్నలిజంలో 8 ఏళ్ల అనుభవం ఉంది. గతంలో V6 News, CVR news,Mojo Tv, 6TV వంటి పలు ఛానళ్లలో పనిచేశారు. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, స్పోర్ట్స్, సినిమా, అనాలిసిస్లు రాయగలరు.


Next Story
Share it
Top