R Ashwin: వన్డే వరల్డ్కప్ జట్టులో అశ్విన్.. కల నెరవేరిందంటూ!
X
రవిచంద్రన్ అశ్విన్.. అన్ని ఫార్మట్ లలో తన మ్యాజిక్ బంతులతో బ్యాటర్లను బోల్తా కొట్టించడంతో దిట్ట. అలాంటి ప్లేయర్ ను బీసీసీఐ కొన్ని సిరీస్ ల నుంచి పట్టించుకోవడం లేదు. టెస్ట్ లకు మినహా ఏ ఫార్మట్ లో చోటు కల్పించడం లేదు. అశ్విన్ ప్లేస్ లో ఇతర ప్లేయర్లకు చాన్స్ లు ఇస్తూ.. అతన్ని బెంచ్ కే పరిమితం చేశారు. సూపర్ ఫామ్ లో ఉన్న అశ్విన్.. ఆసియా కప్ లో చోటు దక్కుతుందని అనుకున్నాడు. చివరికి అనుకున్నది జరగలేదు. వన్డే వరల్డ్ కప్ లో కచ్చితంగా తీసుకుంటారని భావించాడు. అక్కడా నిరాశే మిగిలింది. దాంతో అశ్విన్ మనస్థాపానికి గురయ్యాడు. తనను ఎందుకు పక్కన పెడుతున్నారో తెలియక ఆయోమయంలోకి వెళ్లిపోయాడు. అయితే ఇప్పుడు అశ్విన్ కల నెరవేరే టై వచ్చినట్లు తెలుస్తుంది.
అశ్విన్ కు బదులు స్పిన్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ ను జట్టులోకి తీసుకున్నారు. అయితే ఆసియా కప్ లో బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో గాయపడ్డ అక్షర్.. వరల్డ్ కప్ కు దూరం అయ్యే అవకాశం ఉంది. అంతేకాకుండా అక్షర్ బౌలింగ్ లో కూడా అంత పసకనిపించడం లేదు. అంతేకాకుండా కుల్దీప్, జడేజా, అక్షర్ ఇలా ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లతో బరిలోకి దిగడం సరైంది కాదు. అయినా బ్యాటింగ్ డెప్త్ కావాలని చూసుకుంటే.. బీసీసీఐకి స్పెషలిస్ట్ స్పిన్నర్ ను కోల్పోయే ప్రమాదం ఉంది. ఇప్పుడు అక్షర్ కు గాయం కావడం అశ్విన్ కు కలిసొచ్చే అంశం. తాజాగా ఆస్ట్రేలియాతో వన్డ్ సిరీస్ కు ప్రకటించిన జట్టులో అశ్విన్ కు చాన్స్ ఇచ్చారు. దీన్నిబట్టి చూస్తుంటే.. అశ్విన్ వరల్డ్ కప్ దారులు తెరుచుకున్నట్లు కనిపిస్తుంది.